చాలామందికి బొడ్డు భాగంలో మట్టి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. మనం క్లీన్ చేసే ప్రయత్నం చేసినా.. కొంత భాగం వరకు మాత్రమే శుభ్రం చేసుకునే వీలుంటుంది. బొడ్డు మెలికల్లోని మట్టి పేరుకుపోయి అలానే ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో దురుద వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బొడ్డు లోపల పొరల్లో పేరుకుపోయిన మట్టిని చిటికలో క్లీన్ చేయడానికి మంచి టిప్ చెప్పారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మెడికల్ షాపుల్లో దొరుకుతుందని.. దాన్ని తీసుకొచ్చి పడుకుని.. నాభి నిండా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే.. అది నురగ మాదిరిగా పొంది లోపలి మట్టి అంతా బయటకు వస్తుందని మంతెన చెప్పారు. అలా చేస్తే నాభి అంతా క్లియర్ అవుతుందని వెల్లడించారు. తర్వాత శుభ్రంగా ఇయర్ బర్డ్స్ లేదా దూదితో క్లీన్ చేసుకుంటే అంతా శుభ్రం అవుతుందని చెప్పారు.
అలానే స్నానం చేసిన తర్వాత అన్ని భాగాల్లో క్లీన్ చేస్తారు కానీ.. బొడ్డు దగ్గర మాత్రం క్లీన్ చేయరని మంతెన చెప్పారు. దీంతో నీటి చెమ్మ అక్కడ నిల్వ ఉంటుందని వివరించారు. ఆ చెమ్మలోకి బ్యాక్టీరియా, ఫంగస్ చేరి.. ఇనెఫెక్షన్ అవుతుందని వివరించారు. ఎవరికైనా నాభి వద్ద దురదగా అనిపిస్తే.. అక్కడ క్రిములు చేరాయని అర్థం చేసుకోవాలన్నారు. ఆ సమయంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లీన్ చేసుకోవాలన్నారు. ఇక అసలు దురద రాకుండా ఉండాలంటే.. ఒరిజినల్ క్వాలిటీ కొబ్బరి నూనెను బొడ్డు వద్ద రాస్తే.. మంట లేదా దురద వంటివి ఉండవని వెల్లడించారు. లేదా స్నానానికి వెళ్లేముందు నిమ్మరసాన్ని నాలుగైదు చుక్కలు నాభి వద్ద వేసి.. వేలుతో రొద్దితే.. క్లీన్ అవుతుందని మంతెన చెప్పారు. అలాగే స్నానం చేసేటప్పుడు నాభిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవడం ముఖ్యమన్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.