
డయాబెటీస్ ఉన్నవారు ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత కేర్ అవసరం. ఏదీ సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా తినలేరు. నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. ఏది తిన్నా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరిగిపోతాయి. భోజనానికే ఇలా ఉంటే.. స్నాక్స్ ఊసు అసలు ఎత్తరు. కానీ షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా స్నాక్స్ తినవచ్చు. ఇప్పుడు మీరు విన్నది నిజమే. మనస్ఫూర్తిగా మీరు కూడా స్నాక్స్ తినవచ్చు. వీటిని తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఏమీ పెరగవు. మీ డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి ఆ స్నాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డయాబెటిస్ పేషెంట్స్ స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు.. మొలకెత్తిన బీన్స్ తినడం బెటర్. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. మరీ ఎక్కువ మోతాదులో కాకుండా తగినన్ని తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఆకలిని నియంత్రిస్తాయి.
గుడ్లను కూడా మీరు స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. అయితే ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే ఇంకా మంచిది. గుడ్లలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు తమ ఆహారంలోకి ప్రోటీన్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.
బఠానీల్లో రకాలు కూడా ఉంటాయి. వీటిల్లో తెలుపు రంగులో ఉండే బఠానీలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. వీటిని కూరగాయలతో కూడా కలిపి తినవచ్చు. సలాడ్స్‌లా, స్నాక్స్‌లా ఎలాగైనా తీసుకోవచ్చు. వీటిల్లో కూడా ప్రోటీన్ లభిస్తుంది. ఒక కప్పు ఉడకబెట్టిన బఠానీలు తీసుకోవచ్చు.
షుగర్ పేషెంట్స్ తినే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్‌లో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. వీటిల్లో ఫైబర్ చక్కగా లభ్యమవుతుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.
ఫైబర్, ప్రోటీన్ నిండిన నట్స్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిల్లో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి శరీరానికి కూడా చాలా మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)