వివాహ బంధాన్ని విడదీయరాని సంబంధంగా పరిగణిస్తారు. కానీ నేటి కాలంలో దానిని కాపాడుకోవడం అత్యంత కష్టంగా మారింది. ఏడేడు జన్మల బంధంగా చెప్పుకునే వివాహ బంధాన్ని కొందరు పెళ్లి అయిన రెండు మూడు సంవత్సరాలకే తెగదెంపులు చేసుకుంటున్నారు. అందుకు వారి మధ్య సామరస్యత లేకపోవడమే ప్రధాన కారణం. భార్యభర్తల మధ్య గొడవలు రావడం, మళ్లీ అవి సమసిపోవడం సర్వసాధారణ విషయం. అయితే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలే తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. చివరికి ఆ పరిణామాల ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా చెప్పలేము. అయితే వైవాహిక జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మానసికంగా దూరం: వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధంలో రోజులు గడిచేకొద్దీ ఆలుమగలు ఇద్దరూ ఒకరికి ఒకరు మానసికంగా దగ్గరవుతారు. ఒకరికి మరొకరిపై అంచనాలు పెరుగుతాయి. కానీ చాలా మంది తమ భాగస్వామికి గొడవలు వచ్చినప్పుడు తనను సపోర్ట్ చేయకపోవడమే పెద్ద తప్పు. కోపంలో తమ భాగస్వామితో మానసికంగా కలిసి ఉండకపోవడం, మాట్లాడకపోవడం వంటి ప్రవర్తనను అలవర్చుకుంటారు. ఇది వైవాహిక జీవితానికి మంచిది కాదు.
శారీరక సంబంధం: వైవాహిక సంబంధం రోజుల గడిచి పాతబడినప్పుడు శారీరక సంబంధం లేదా సాన్నిహిత్యం తగ్గడం సాధారణం. సమయం గడిచేకొద్దీ సంబంధంలో క్షీణిస్తున్న పరిస్థితుల కారణంగా వ్యక్తుల లైంగిక జీవితం చెదిరిపోతుంది. సెక్స్ లైఫ్ బోరింగ్ అవుతున్న కారణంగా సంబంధం కూడా విచ్ఛిన్నమయ్యే అంచుకు రావచ్చు. నిజానికి వైవాహిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి లైంగిక జీవితమే ఉత్తమ మార్గం. కలిసి సెలవులకు వెళ్లడం లేదా కలిసి సమయాన్ని గడపడం ద్వారా ఒకరినొకరు మళ్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లైంగిక జీవితాన్ని విస్మరిస్తే వైవాహిక బంధం ముగిసిపోయే ప్రమాదం ఉందని గుర్తించండి.
పని భారం: పని, దానికి సంబంధించిన బాధ్యతలు సాధారణంగా ప్రతి ఒక్కరిపై ఉంటాయి. కానీ దాని ఒత్తిడిలో సంబంధాన్ని విస్మరించడం ప్రధానమైన తప్పు. పని జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితాన్ని కూడా సమతుల్యం చేసుకోవడం తెలివైన పని. వ్యక్తులు తమ ఉద్యోగ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మిళితం చేయడం ద్వారా వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు. అందువల్ల మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయకూడదనుకుంటే ఉద్యోగ బాధ్యతలను తెలివిగా సర్దుబాటు చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..