ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు..మీ రోజు అందంగా ఉంటుంది..!

మన ఉదయం మనం రోజంతా ఎలా ఉంటామో నిర్ణయిస్తుంది. మీరు ప్రతిరోజూ మీ ఉదయాన్ని ఎలా గడుపుతారనేది ఆ రోజు ఎంత అందంగా ఉంటుందో నిర్ణయిస్తుంది. కాబట్టి, మీ రోజును అందంగా మార్చుకోవడానికి ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని పనులు తప్పనిసరిగా చేయండి. దీంతో మీ రోజు అందంగా ఉంటుంది..! ఉదాహరణకు, మీ మొబైల్ ఫోన్ చూడటం, ధ్యానం చేయడం, వాకింగ్, కావాల్సినన్నీ నీళ్లు తాగటం, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వంటి మంచి అలవాట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు..మీ రోజు అందంగా ఉంటుంది..!
Early Morning

Updated on: Nov 01, 2025 | 7:15 AM

ఉదయం నిద్రలేచి తరువాత మనం చేసే పనులు మన రోజంతటినీ ప్రభావితం చేస్తాయి. మన మనోభావాలను, ఉత్సాహాన్ని, శారీరక శక్తిని కూడా మనం ఉదయాన్నే చేస్తున్న పనుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే తప్పనిసరిగా మార్నింగ్ తొందరగా లేచే అలవాటు చేసుకోవడం తప్పనిసరి. ఉదయపు ప్రశాంత వాతావరణం మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది. ఇలా లేవడం వల్ల మనకు రోజంతా సమయం ఎక్కువగా దొరికినట్లుగా అనిపించి, మన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఇలాంటి ఎన్నో అలవాట్లు మనకు మంచి రోజును అందిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

త్వరగా లేవండి: ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు మార్నింగ్‌ ఎక్కువ టైమ్ దొరుకుతుంది. కాబట్టి, మీరు మీ పనులన్నీ రిలాక్స్‌డ్‌గా నచ్చినట్టుగా చేసుకోవచ్చు.

మీ మొబైల్ వైపు చూడకండి: ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూడటం అస్సలు చేయకండి..మీరు కొన్ని నిమిషాలు మాత్రమే అనుకుని ఫోన్‌ పట్టుకున్నారంటే..అది మీ మార్నింగ్‌ టైమ్‌ మొత్తాన్ని లాగేసుకుంటుంది. దీంతో మీరు మళ్ళీ బిజీగా,హడావుడి ఉండే వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధ్యానం చేయండి: మీరు ఉదయం నిద్ర లేవగానే ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. ఇది పరధ్యానాలను నివారిస్తుంది. స్పష్టమైన ఆలోచనలతో, ఒత్తిడి లేకుండా పని చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. సాధారణంగా మనం ఉదయం నిద్రలేచినప్పుడు మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేసినా అది ఆ రోజు మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి.

వాకింగ్‌: ప్రతిరోజు ఉదయాన్నేవ్యాయామం చేయడం మంచిది. వాకింగ్‌ జాగింగ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు కూడా శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇవి మీ రోజును కొత్తగా ప్రారంభించడంలో మీకు సహాయపడతాయి.

నీరు తాగండి: ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరం నుండి విష వ్యర్థాల్ని తొలగించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాఫీ/టీ తాగడం: కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ/టీ తాగుతారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తాగడం మానుకోండి.. ఎందుకంటే ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది.

బ్రేక్‌ఫాస్ట్‌: ఎప్పుడూ మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్‌ చేయకండి. అలా చేయటం వల్ల కడుపు ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. మీరు తినే అల్పాహారం ఫాస్ట్ ఫుడ్ కాకుండా చూసుకోండి. వీలైనంత ఎక్కువ ప్రోటీన్లు, ధాన్యాలు కలిగిన ఆహారాలు తినండి. ఇది మీ శరీరానికి శక్తిని ఇస్తుంది.

చల్లటి నీటితో స్నానం: చల్లటి నీటితో స్నానం చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లటి నీటిని తట్టుకోలేని వారు వేడి నీటితో చల్లటి నీటిని కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు.

ఆఫీసుకు త్వరగా బయలుదేరండి: సాధారణం కంటే 15-20 నిమిషాలు ముందుగా ఆఫీసుకు బయలుదేరండి. ఈ విధంగా, మీరు ఎటువంటి తొందర లేదా చివరి నిమిషంలో తొందర లేకుండా పనిని పూర్తి చేయగలుగుతారు.
ఆఫీసుకు త్వరగా బయలుదేరండి: సాధారణం కంటే 15-20 నిమిషాలు ముందుగా ఆఫీసుకు బయలుదేరండి. ఈ విధంగా, మీరు ఎటువంటి తొందర లేదా చివరి నిమిషంలో తొందర లేకుండా పనిని పూర్తి చేయగలుగుతారు.

ముందస్తు ప్రణాళిక: మీరు ఈరోజు ఏం చేయబోతున్నారో ముందుగానే ప్లాన్‌ చేసుకోండి. ఇది మీరు దృష్టి కేంద్రీకరించడానికి, ఏదైనా మర్చిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని కోపానికి గురి కావద్దు. దీనివల్ల ఈ కోపం, చిరాకు రోజంతా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎంత ప్రశాంతంగా మీరు మీ రోజును ప్రారంభిస్తారో రోజంతా అంతే ప్రశాంతంగా ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..