Health: గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? కొలెస్ట్రాల్‌ పెరిగినట్లే..

అందుకే శరీంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడాలని చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, వర్కవుట్స్‌ వంటి చేయాలని సూచిస్తున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయన్న విషయం త్వరగా తెలిస్తే చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చు. దీంతో పలు సమస్యల నుంచి బయటపడొచ్చు. సాధారణంగా కొలెస్ట్రాల్‌...

Health: గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? కొలెస్ట్రాల్‌ పెరిగినట్లే..
High Cholesterol
Follow us

|

Updated on: Jul 01, 2024 | 5:59 PM

మారిన జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుందని తెలిసిందే. ముఖ్యంగా అధికరక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌ వంటి సమస్యలన్నింటికీ కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం నిపుణులు సైతం చెబుతున్నారు.

అందుకే శరీంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడాలని చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, వర్కవుట్స్‌ వంటి చేయాలని సూచిస్తున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయన్న విషయం త్వరగా తెలిస్తే చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చు. దీంతో పలు సమస్యల నుంచి బయటపడొచ్చు. సాధారణంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలును లిపిడ్‌ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇలా కాకుండా గోళ్లలో కనిపించే మార్పుల ద్వారా కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిన విషయాన్ని అంచనా వేయొచ్చు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* సాధారణంగా గోళ్లు పసుపు రంగులోకి మారితే పచ్చ కామెర్లుగా భావిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినా ఇదే లక్షణం కనిపిస్తుంది. రక్తప్రసరణలో అడ్డండి ఏర్పడడం కారణంగా కూడా గోళ్ల రంగు మారుతుంది.

* కొన్ని సందర్భాల్లో గోళ్లు గట్టిపడటం కూడా కొలెస్ట్రాల్‌ పెరుగుదలకు సంకేతంగా చెప్పొచ్చు. శరీరంలో పెరిగే ఎల్‌డీఎల్‌ కారణంగా గోళ్లు మందంగా మారుతాయి.

* గోళ్లపై తెల్లని మచ్చలు కనిపించినా కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* గోర్లు నెమ్మదిగా పెరుగుతున్నా అధిక కొలెస్ట్రాల్‌కు సంతకేతంగా చెప్పొచ్చు. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, గోరు పెరుగుదల మందగిస్తుంది. బలహీనంగా మారుతాయి.

* శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ ఉంటే గోర్లు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. దీంతో గోర్లు సులభంగా విరిగిపోతాయి. ఇది కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిందని చెప్పడానికి సంకేతం.

ఇవి పాటించండి..

పైన తెలిపిన లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అయితే వైద్యుల సూచనలతో పాటు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైంది ఆరోగ్యకరమైన ఆహాం. తీసుకున్న ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతీరోజూ వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. దీంతో రక్త ప్రసరణ పెరిగి, కొలెస్ట్రాల్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..