03 July 2024
TV9 Telugu
Pic credit - pexels
ఏడాది పొడవునా కర్ర పెండలం పండుతుంది. చౌకగా లభించే ఈ కర్రపెండలాన్ని పేదవారి ఆహారం అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో గోధుమలకు బదులుగా కర్రపెండలాన్ని ఆహారంగా తీసుకుంటారు.
రోజూ తినే ఆహారపదార్థాల్లో కర్రపెండలం ఉత్తమమైనది. ఈ కర్రపెండలం గ్లూటెన్ రహితమైంది. ఇందులో విటమిన్ 'సి', కాపర్ సమృద్ధిగా ఉన్నాయి.
కర్ర పెండలం ఎక్కువగా అడవుల్లో లభిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంట చేతికి వస్తుంది. కిలో రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది.
కర్ర పెండలాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కర్రపెండలాన్ని విరివిరిగా ఉపయోగిస్తారు.
కర్రపెండలంలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి, సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒక బలవర్ధకమైన ఆహారం.
కర్ర పెండలాన్ని ఉడికించి లేదా మంటపై కాల్చి తింటారు. దీనిని తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది.
గుండె బలంగా తయారవుతుంది. గుండె సమస్యలతో బాధపడే వారు కర్రపెండలం తినడం వలన మంచి ఫలితం ఉంటుంది.