పురుషుల బట్టతల రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

TV9 Telugu

03 JULY 2024

ప్రస్తుతం పెద్దవారి నుండి చిన్నవాళ్ళ వరకు అందరు ఎదుర్కునే ప్రధాన సమస్య జుట్టు రాలడం. ఇది ఒకరి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది.

కొంతమందికి జుట్టు ఎక్కువగా రాలిన మరల తిరిగివస్తుంది మరికొంత మందికి ఊడిన జుట్టు మరల తిరిగి రాకుండా బట్టతల కూడా వస్తుంటుంది.

అయితే ఈ జుట్టు రాలటానికి బట్ట తల రావడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులలో బట్టతల రావడానికి ప్రధాన సమస్య వంశపారంపర్య పరిస్థితి. మీ తండ్రి లేదా తాతలకు బట్టతల ఉన్నట్లు అయితే వారసత్వంగా మీకు వస్తుంది.

బట్టతల రావడానికి మరొక కారణం హార్మోన్ల సమతుల్యత లేకపోవడం. DHT జుట్టు కుదుళ్లను కుదించగలదు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. 

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల జుట్టు అధికంగా రాలుతుంది. వ్యాయామం లేకపోవడం మరియు ధూమపానం జుట్టు పెరుగుదలతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 

కొన్ని వైద్య పరిస్థితులు మరియు చికిత్సలు పురుషుల బట్టతలకు దోహదం చేస్తాయి. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తాత్కాలిక లేదా శాశ్వత బట్టతలకు దారితీయవచ్చు.