Pawan Kalyan: గెలుపుతోపాటు చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేస్తా.. పిఠాపురంపై పవన్ కల్యాణ్ వరాల జల్లు

పిఠాపురం.. గెలుపుతో పాటు చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేస్తా అంటూ వరాల జల్లు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటానని హామీనిచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. చేయబోయే పనులన్నింటిని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు పవన్‌.

Pawan Kalyan: గెలుపుతోపాటు చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేస్తా.. పిఠాపురంపై పవన్ కల్యాణ్ వరాల జల్లు
Pawan Kalyan In Varahi Meeting
Follow us

|

Updated on: Jul 03, 2024 | 9:13 PM

పిఠాపురం.. గెలుపుతో పాటు చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేస్తా అంటూ వరాల జల్లు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటానని హామీనిచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. చేయబోయే పనులన్నింటిని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు పవన్‌.

అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి వెళ్లారు పవన్ కల్యాణ్. ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. తాను కోరుకోని డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం.. దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్‌ కల్యాణ్. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కల్యాణ్. ఎంతో ధైర్యం, బలం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు పవన్. పిఠాపురంలో సెరీకల్చర్‌ అభివృద్ధి.. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తామన్నారు.

కోతకు గురవుతున్న ఉప్పాడ తీరం సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు పవన్. అలాగే టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కోటగుమ్మం గేట్‌ దగ్గర రైల్వే ఫ్లై ఓవర్‌ ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీనిచ్చారు పవన్. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకొస్తానన్నారు. పిఠాపురంలో ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి వేరు.. ఇకపై జరిగే అభివృద్ధి వేరుగా ఉంటుందన్నారు పవన్ కల్యాణ్‌. నిస్వార్ధంగా, లంచాలకు తావులేకుండా పాలన సాగిస్తానని హామీనిచ్చారు. ఫైనల్‌గా పవన్‌ నియోజకవర్గంపై చూపించిన ప్రేమ ఆప్యాయతలకు జనం ఫిదా అవుతున్నారు.

అలాగే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు యువత, తమ బైక్‌లకు నెంబర్ ప్లేట్లు తొలగించుకుని మరీ.. జనసేన ముద్రతో ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అని రాయించుకున్నారు. ఈ ధోరణిపై పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ నంబర్ ప్లే్ట్ నిబంధనలు పాటించాలని కోరారు. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు అది తనమీదికి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. కావాలంటే యువత బైక్ రేసింగ్‌లు చేసుకోవాలనుకునే తన రెండెకరాల స్థలంలో వాడుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు