
అగ్రా, ఢిల్లీ : ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహాల్‌ను లవర్స్ డే రోజు ఎంతో మంది సందర్శి్స్తుంటారు. ప్రేమికుల రోజున మీ భాగస్వామిని ఆనందపరచాలి అంటే తప్పకుండా ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అందమైన చార్మినార్ వెలుగుల మధ్య మీ ప్రేమను వ్యక్త పరచడం చాలా అద్భుతంగా ఉంటుంది.

ఫ్లవర్ లోయ, ఉత్తరా ఖండ్ : ఉత్తరా ఖండ్ పూల లోయ ఎవరికి నచ్చదు చెప్పండి. ప్రేమికుల మనసు దోచుకోవడంలో ఇది ముందు ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల అందమైన పూలు దర్శనం ఇస్తాయి. లావెండర్, గులాబీ, జాస్మిన్ తోటల నుంచి ఎన్నో రకాల పూలు ఉంటాయి. ఈ రకరకాల పూల మధ్య మీ ప్రేమను వ్యక్త పరచడం మీ జీవితంలోనే అద్భుతమైన, మధురమై జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

ఊటీ : మీ భాగస్వామితో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఊటీ వెళ్లాల్సిందే. సరస్సుల్లో కలిసి పడవలో ప్రయాణం చేయడం, లోయల గుండా ట్రైన్‌లో ప్రయాణిస్తూ, మీ జీవితానికి సంబంధించిన కలలు కంటూ, మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఆనందంగా గడపవచ్చు. అంతే కాకుండా ఇక్కడి హిల్ స్టేషన్స్, కాఫీ తోటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందమైన ప్రదేశంలో ఇది ఒక్కటి. సూర్యాస్తమయం సమయంలో కాఫీ తోటలు, పూల తోటల్లో ఆ సూర్యుడి సాక్షిగా మీ ప్రేమను వ్యక్త పరచడం వలన అది మీ జీవితంలోనే ఓ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

లక్షద్వీప్ : మీ భాగస్వామికి మీ ప్రేమను తెలపడానికి అద్భుతమైన ప్రదేశం లక్షద్వీప్. భారతదేశంలోని లవర్స్ రొమాంటిక్ ప్రదేశాల్లో ఇది ముందుంటుంది. ఇక్కడ మీ మనస్సు దోచే సరస్సులు, బీచ్‌లు ఉంటాయి. అందమైన ద్వీపాల మధ్య మీరు మీ ప్రేమను వ్యక్తపరచవచ్చును. ఇక ఇలాంటి బ్యూటిపుల్ ప్లేస్‌లో ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.

ఉదయ్ పూర్ : ఉదయ్ పూర్‌ను రాచరిక ప్రేమకథల నగరం అని కూడా అంటారు. భారత దేశంలోనే అద్భుతమైన, అందమైన ప్రదేశం ఉదయ్ పూర్. ఇక్కడ మెరిసే అందమైన భవనాలు, సరస్సులు ఉంటాయి. పిచోలా సరస్సు వద్ద సూర్యాస్తమయం సమయంలో పడవ ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది.