Smartphone Tips: వర్షంలో వెళ్లాలి.. కానీ ఫోన్‌ తడవకూడదు.. ఎలా? ఇదిగో ఈ టిప్స్‌ పాటించండి చాలు..

వర్షకాలంలో మొబైళ్ల భద్రత కోసం వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు బాగా ఉపకరిస్తాయి. ఇవి ఆన్‌లైన్‌లో రూ. 99 కంటే తక్కువకే లభిస్తాయి. ఉదాహరణకు, జెనెరిక్ ద్వారా వాటర్‌ప్రూఫ్ మొబైల్ పౌచ్ ఐపీ8 రేటింగ్‌ తో ఉండే వాటర్‌ప్రూఫ్‌ టచ్‌ ఫ్రెండ్లీ పౌచ్‌ కేవలం రూ.90కే ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం అమెజాన్‌లో లభిస్తోంది.

Smartphone Tips: వర్షంలో వెళ్లాలి.. కానీ ఫోన్‌ తడవకూడదు.. ఎలా? ఇదిగో ఈ టిప్స్‌ పాటించండి చాలు..
Smartphone Protection In Rain

Updated on: Jul 11, 2023 | 1:00 PM

వర్షాకాలం.. చాలా మందికి ఇష్టమైన కాలం. రోజంతా ముసుగుతన్ని నిద్రపోవాలనిపించే కాలం. అదే సమయంలో రోజంతా వర్షం కురుస్తుంటే చిరాకనిపించే కాలం కూడా. ముఖ్యంగా అత్యవసరంగా బయటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షం కుంభవృష్టిగా కురిస్తే చాలా ఇబ్బందికరంగా ఫీల్‌ అవుతాం. మనం ఎలాగూ తడుస్తాం.. కానీ మన చేతిలో ఎల్లప్పుడూ ఉండే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను తడవకుండా కాపాడుకోవడం ఆ సమయంలో సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ వర్షం నీటిలో తడవకుండా కాపాడుకోడానికి వినియోగదారులు చాలా శ్రమిస్తుంటారు. అయితే ఈ వర్షాకాలంలో సెల్‌ఫోన్‌ వినియోగదారులు ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అటువంటి జాగ్రత్తల్లో ఒకటి ఫోన్‌ పౌచ్‌. ఈ వర్షాకాలంలో మామూలు పౌచ్‌ కాకుండా వాటర్‌ ప్రూఫ్‌ పౌచ్‌ వాడటం మేలు. ఆన్‌లైన్‌ లో పెద్ద సంఖ్యలో వాటర్‌ ప్రూఫ్‌ పౌచ్‌ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ది బెస్ట్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఫోన్‌ తడవకుండా కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలను టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..

వాటర్‌ ప్రూఫ్‌ పౌచ్‌.. వర్షకాలంలో మొబైళ్ల భద్రత కోసం వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు బాగా ఉపకరిస్తాయి. ఇవి ఆన్‌లైన్‌లో రూ. 99 కంటే తక్కువకే లభిస్తాయి. ఉదాహరణకు, జెనెరిక్ ద్వారా వాటర్‌ప్రూఫ్ మొబైల్ పౌచ్ ఐపీ8 రేటింగ్‌ తో ఉండే వాటర్‌ప్రూఫ్‌ టచ్‌ ఫ్రెండ్లీ పౌచ్‌ కేవలం రూ.90కే ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం అమెజాన్‌లో లభిస్తోంది. అయితే డెలివరీ చార్జీలు వర్తిస్తాయి. అలాగే కొంచెం ఖరీదైంది కావాలంటే బోబో యూనివర్సల్ వాటర్‌ప్రూఫ్ పౌచ్‌ కూడా ఉంది, ఇది 7.5-అంగుళాలు ఉంటుంది. ఇది కూడా ఐపీ8 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్ క్లియర్ కేస్తో వస్తోంది. అమెజాన్‌లో దీని ధర రూ. 299గా ఉంది. తరచూ ప్రయాణాలు చేసే వారికి వర్షాకాలంలో ఈ వాటర్‌ ప్రూఫ్‌ పౌచ్‌ లు బాగా ఉపయోగపడతాయి.

సిలికా జెల్ ప్యాకెట్‌లతో కూడిన జిప్‌లాక్ పౌచ్‌.. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి జిప్‌లాక్ పౌచ్‌ మరొక మంచి ఎంపిక. తేమను దూరంగా ఉంచడానికి అదనపు రక్షణ కోసం సిలికా జెల్ ప్యాకెట్‌లో ఫోన్‌ను భద్ర పరచవచ్చు. జిప్‌లాక్ పౌచ్‌లు, సిలికా జెల్ ప్యాకెట్‌లు సూపర్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు.. వాటర్‌ప్రూఫ్ కేస్ లేదా జిప్‌లాక్ పౌచ్‌ను తీసుకెళ్లడం మర్చిపోయేవారు.. మీ ఫోన్‌ను జేబులో లేదా బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది. దానిని వర్షంలో బయటకు తీయడం ఇబ్బంది కాబట్టి బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు వినియోగించడం మేలు. చాలా హెడ్‌ఫోన్‌లు త్వరగా పాడవవు. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి కావొచ్చు.

ఫోన్‌ తడిసిపోతే ఇలా చేయండి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఫోన్‌ తడిసిపోతుంది. ఆ సమయంలో మొదటిగా మీరు చేయాల్సిందేంటి అంటే మీ ఫోన్‌లో రిమూవబుల్‌ బ్యాటరీ ఉంటే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి బ్యాటరీని వేరు చేయాలి. చార్జింగ్‌ అస్సలు పెట్టొద్దు. అలాగే ఫోన్‌ ను ఆరబెట్టడానికి హెయిర్‌ డ్రైయర్‌ ను వాడొద్దు. అవకాశం ఉంటే మీ ఫోన్‌ ఓ బకెట్‌లో పొడి బియ్యం వేసి, రాత్రంతా దానిలో వదిలేయండి. లేదా సిలికా జెల్‌ ప్యాకెట్లతో కూడిన జిప్‌ లాక్‌ పౌచ్ లో ఉంచండి. అయితే ఫోన్‌ మళ్లీ పాత స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటికీ బాగుకాకపోతే సర్వీస్‌ సెంటర్‌లో చూపించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..