Lifestyle: రాత్రుళ్లు కనిపించే ఈ లక్షణాలు.. హైబీపీకి సంకేతాలు కావొచ్చు..

|

Feb 28, 2024 | 5:42 PM

ఇదిలా ఉంటే శరీరంలో బీపీ పెరగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని రకాల లక్షణాల ద్వారా బీపీని ముందుగానే గుర్తుంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. NPJ డిజిటల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక BP వచ్చే అవకాశం ఉందని...

Lifestyle: రాత్రుళ్లు కనిపించే ఈ లక్షణాలు.. హైబీపీకి సంకేతాలు కావొచ్చు..
Sleep
Follow us on

ప్రస్తుతం హైబీపీతో ఇబ్బందిపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా తక్కువ వయసులో బీపీ బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో హైబీపీ కారణంగా స్ట్రోక్‌, గుండెపోటుకు కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే శరీరంలో బీపీ పెరగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని రకాల లక్షణాల ద్వారా బీపీని ముందుగానే గుర్తుంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. NPJ డిజిటల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక BP వచ్చే అవకాశం ఉందని తేలింది. దీంతోపాటు నిద్రపోతున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కూడా హై బిపికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో నిద్ర సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ఒకటి, ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఒత్తిడి, ఆందోళనతో పాటు హైబీపీ కారణంగా కూడా నిద్రలేమి సమస్య వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో ఎక్కువగా గురక వస్తున్నా బీపీకి లక్షణంగా భావించాలని చెబుతున్నారు. సాధారణంగా రాత్రిపూట గురక స్లీప్ అప్నియాగా చెబుతుంటారు. అయితే ఇది బీపీకి కూడా లక్షణంగా చెబుతున్నారు.

* రాత్రిపూట పడుకున్న సమయంలో అధిక మూత్ర విసర్జన కూడా బీపీ లక్షణంగా చెబుతున్నారు. సాధారణంగా అధిక మూత్ర విసర్జన షుగర్‌ లక్షణంగా భావిస్తాం కానీ అధిక రక్తపోటు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది దీని వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుందని, మూత్రవిసర్జన చేయడానికి రాత్రిపూట చాలా సార్లు లేవవలసి ఉంటుందని చెబుతున్నారు.

* రాత్రి పడుకునే సమయంలో తలనొప్పి కూడా అధిక రక్తపోటుకు సంకేంతంగా చెబుతున్నారు. అధిక బీపీ వల్ల వచ్చే తలనొప్పి ఉదయం పూట కంటే చాలా తీవ్రంగా ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..