Cucumber: మంచిదని దోసకాయ ఎక్కువగా తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

|

Sep 06, 2024 | 5:31 PM

దోసకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులోని నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ వంటి సమస్య బారినపడకుండా ఉంచడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది...

Cucumber: మంచిదని దోసకాయ ఎక్కువగా తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
Cucumber
Follow us on

దోసకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులోని నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ వంటి సమస్య బారినపడకుండా ఉంచడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దోసకాయతో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దోసకాయతో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దోసకాయను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ఇంతకీ దోసకాయను ఎక్కువగా తీసుకుంటే జరిగే అనర్థాలు ఏంటో ఇప్పుడ తెలుసుకుందాం..

* దోసకాయను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దోసకాయలో కుకుర్బిటాసిన్ ఉంటుంది. ఇది అజీర్తి సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు దోసకాయకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి వాళ్లు దోసకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో బాధపడాల్సి వస్తుంది.

* ఇక దోసకాయలో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే దోసకాయను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సినంత నీరును అందిస్తుంది. అయితే దోసకాయను అధికంగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షుగర్‌ పేషెంట్స్‌కి ఇది అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన ఎక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* గర్భణీలు కూడా దోసకాయను ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని ఫైబర్‌ కంటెంట్ కడుపు సంబంధిత సమస్యలతో పాటు, మూత్ర విసర్జన ఎక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి అతి ఏదైనా అనర్థానికే దారి తీస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని, దోసకాయను మితంగా తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..