Lifestyle: జుట్టు తెల్లబడడానికి ఇవి కూడా కారణాలని మీకు తెలుసా.?

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్నసమస్యల్లో జుట్టు తెల్లబడడం ఒకటి. జుట్టు తెల్లబడడం అనేది కేవలం వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసున్న వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు తెలబడడానికి మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులే...

Lifestyle: జుట్టు తెల్లబడడానికి ఇవి కూడా కారణాలని మీకు తెలుసా.?
White Hair

Updated on: Mar 18, 2024 | 10:56 PM

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్నసమస్యల్లో జుట్టు తెల్లబడడం ఒకటి. జుట్టు తెల్లబడడం అనేది కేవలం వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసున్న వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు తెలబడడానికి మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు అంటున్నారు. ఇంతకీ తెల్ల జుట్టు రావడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తలకు నూనె రాసుకోకపోవడం కూడా తెల్ల జుట్టుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒక్కసారైనా తలకు నూనెను పెట్టుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా పోషకారలోపం వల్ల తల పొడిబారుతుంది. ఇది కూడా జుట్టు తెల్లబడడానికి కారణమని అంటున్నారు.

* అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగితే కాల క్రమేణా జుట్టు బూడిద రంగులోకి మారుతుందని చెబుతున్నారు.

* రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు వాడినా హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కూడా జుట్టు రంగు మారుతుంది.

* స్మోకింగ్ అలవాటు కూడా జుట్టు త్వరగా తెల్లబడడానికి కారణని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొగాకు పొగలోని హానికరమైన రసాయనాలు జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి, మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి.

* జుట్టు త్వరగా తెల్లబడడానికి నిద్రలేమి కూడా ఒక కారణం. నిద్ర సరిపోకపోతే.. జుట్టు తెల్లబడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నిద్ర లేకపోవడం జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన వివిధ శారీరక విధులకు అంతరాయం కలిగిస్తుంది.

ఈ టిప్స్‌ పాటించండి..

* వారానికి కనీసం రెండు సార్లు కొబ్బరి నూనెను రాయడం అలవాటుగా చేసుకోండి. వేప ఆకులు, మెంతి గింజలను నూనెలో కలిపి అప్లై చేసుకుంటే మరింత ఫలితం ఉంటుంది.

* తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జుట్టును లోపలి నుండి బలంగా మారుతుంది.

* ఎక్కువసేపు ఎండలో ఉండే క్యాప్‌లు వంటి వాటిని ధరించాలి. ఇది కూడా జుట్టు తెల్లబడడానికి కారణమవుతుంది.

* విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..