Lifestyle: బ్ర‌ష్ చేసేప్పుడు నాలుక‌పై ర‌క్తం వ‌స్తుందా.? జాగ్ర‌త్త ప‌డాల్సిందే..

|

Aug 04, 2024 | 10:02 AM

బ్ర‌ష్ చేసే స‌మ‌యంలో అప్పుడ‌ప్పుడు చిగుళ్ల నుంచి ర‌క్తం రావ‌డం స‌ర్వసాధార‌ణ‌మైన విష‌యం. చిగుళ్లు బ‌ల‌హీనంగా మార‌డం, తీసుకునే ఆహారంలో చేసే త‌ప్పులు ఇలా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే ఉంటారు. అయితే నాలుక‌పై నుంచి కూడా...

Lifestyle: బ్ర‌ష్ చేసేప్పుడు నాలుక‌పై ర‌క్తం వ‌స్తుందా.? జాగ్ర‌త్త ప‌డాల్సిందే..
Brushing
Follow us on

బ్ర‌ష్ చేసే స‌మ‌యంలో అప్పుడ‌ప్పుడు చిగుళ్ల నుంచి ర‌క్తం రావ‌డం స‌ర్వసాధార‌ణ‌మైన విష‌యం. చిగుళ్లు బ‌ల‌హీనంగా మార‌డం, తీసుకునే ఆహారంలో చేసే త‌ప్పులు ఇలా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే ఉంటారు. అయితే నాలుక‌పై నుంచి కూడా ర‌క్తం వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఇలా బ్ర‌ష్ చేసే స‌మ‌యంలో నాలుక‌పై ర‌క్తం వ‌స్తే కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చిహ్నంగా భావించాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ అనారోగ్య కార‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నాలుకపై పాపిల్లే అనే ఒక నిర్మాణం ఉంటుంది. కొన్ని సంర‌ద్భాల్లో నాలుక‌ను కోరుక్కోవ‌డం లేదా గ‌ట్టిగా బ్ర‌ష్ చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌స్రావం జ‌రుగుతుంది. పైనాపిల్ వంటి ఆమ్లం ఎక్కువ‌గా ఉండే ఆహాప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

* ఇక నోటిలో ఉండే కొన్ని పుండ్ల కార‌ణంగా ఉండే నాలుక‌పై ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నాలుక‌పై ఏర్ప‌డే బొబ్బ‌లు బ్ర‌ష్ చేసే స‌మ‌యంలో ప‌గ‌ల‌డం వ‌ల్ల ర‌క్తస్రావం జ‌రుగుతుంది.

* నోటిలో ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ఉన్నా కూడా ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. నోటిపై ఎర్ర‌టి మ‌చ్చ‌లు, నాలుక‌పై దుర‌ద వంటి ల‌క్ష‌ణాలు ఇన్ఫెక్ష‌న్‌కు ల‌క్ష‌ణాలుగా చెప్పొచ్చు.

* ఇక కొన్ని సంద‌ర్భాల్లో విట‌మిన్ బీ12 లోపం వ‌ల్ల కూడా నాలుక నుంచి ర‌క్త‌స్రావం అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విట‌మిన్ లోపం నాలుకన‌ను బ‌ల‌హీనంగా మార్చుతుంది.

* హేమాంగియోమా కార‌ణంగా కూడా నాలుక నుంచి ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంటుంది. నాలుక‌పై ఉండే ర‌క్త నాళాలు పెర‌గ‌డంతో ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

* నాలుక నుంచి ర‌క్త స్రావం కావ‌డం క్యాన్స‌ర్‌కు కూడా సంకేతంగా భావించాల‌ని నిపుణులు చెబుతున్నారు. నాలుక‌పై గ‌డ్డ‌లు ఏర్ప‌డినా, గొంతులో నొప్పి దీర్ఘ‌కాలంగా ఉన్నా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించిన సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

ఇలా చేయండి..

ఒక‌వేళ నాలుక నుంచి ర‌క్త‌స్రావం అవ‌తుందే. ఒక గుడ్డ‌తో వ‌ద్ది పెట్టాలి. దీంతో ర‌క్తస్రావం ఆగిపోతుంది. అలాగే ఐస్ ముక్క‌ను ఒక గుడ్డ‌లో చుట్టి నాలుక‌పై రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌స్రావం ఆగిపోతుంది. తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. మ‌సాలాలు, ఆమ్లాలు ఎక్కువ‌గా ఉండే ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బ్లీడింగ్ ఉన్న ప్రదేశంలో బ్లాక్ టీ బ్యాగ్ ఉంచడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…