గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు తీవ్రమవుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. కొన్ని రకాల ప్రధాన అలవాట్లే గుండె పోటుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎట్టి పరిస్థితుల్లో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే నూనె, కొవ్వు గుండె సిరలలో అడ్డంకిని కలిగిస్తాయి. దీంతో గుండె పోటు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్‌ను కూడా తగ్గించాఇ. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
* గుండెపోటుకు ధూమపానం, మద్యం సేవించడం కూడా ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. వీటి కారణంగా హృదయ స్పందనపై ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరిగి స్ట్రోక్‌కి దారి తీసే అవకాశం ఉంటుంది.
* గుండెపోటు రావడానికి మరో ప్రధాన కారణం ఒత్తిడి. ఇటీవల ఒత్తిడితో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. సరైన నిద్రలేకపోవడం, ఒత్తిడితో చిత్తవడం కారణంగా రక్తపోటుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, మోడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
* శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాన్ని చేయకపోవడం కారణంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవాకశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయడాన్ని కచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* గుండె సంబంధిత సమస్యలు రావడానికి మరో ప్రధాన కారణం ఉప్పు ఎక్కుగా తీసుకోవడం. మోతాదుకు మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది సహజంగానే గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును తగ్గించాలి. అలాగే.. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో ఫుడ్ త్వరగా పాడవకుండా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే చట్నీలకు సైతం దూరంగా ఉండాలి.
* గుండెపోటు రావడానికి ఊబకాయం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..