Lifestyle: శరీరంలో ఈ ప్రదేశాల్లో వాపు ఉంటుందా.? ఈ సమస్య ఉన్నట్లే..

మనకు వచ్చే అనారోగ్య సమస్యలను శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. కొన్ని లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్‌ చేస్తుంది. ఇలాంటి లక్షణాల్లో శరీరంలో కనిపించే వాపు కూడా ఒకటి. శరీరంలోని కొన్ని చోట్ల వచ్చే వాపు కిడ్నీల పనితీరు పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: శరీరంలో ఈ ప్రదేశాల్లో వాపు ఉంటుందా.? ఈ సమస్య ఉన్నట్లే..
Health

Updated on: Apr 07, 2024 | 8:37 PM

మనకు వచ్చే అనారోగ్య సమస్యలను శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. కొన్ని లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్‌ చేస్తుంది. ఇలాంటి లక్షణాల్లో శరీరంలో కనిపించే వాపు కూడా ఒకటి. శరీరంలోని కొన్ని చోట్ల వచ్చే వాపు కిడ్నీల పనితీరు పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* పాదాలు లేదా చీలమండలలో వాపు ఉంటే, అది కిడ్నీ దెబ్బతినడానికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మూత్రపిండాలు సరిగ్గా పని చేయనప్పుడు, కాళ్ళలో ద్రవం చేరడం ప్రారంభమవుతుంది, దాని కారణంగా వాపునకు కారణమవుతుంది. కారణం లేకుండా పాదాల్లో వాపు వస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.

* మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల, ముఖం కూడా వాపు ప్రారంభమవుతుంది. ఈ లక్షణాన్ని కూడా విస్మరించకూడదు. అయితే, ముఖం మీద వాపునకు అనేక కారణాలు ఉండవచ్చు. ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* చేతులు, వేళ్లలో వాపు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా మూత్రపిండాల వైఫల్యానికి లక్షణం కావొచ్చు. కొన్నిసార్లు కీళ్ల నొప్పుల వల్ల కూడా వేళ్లలో వాపు రావొచ్చు.

* కళ్లు ఉబ్బినట్లు కనిపించినా కిడ్నీ ఫెయిల్యూర్ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని పెరియోర్బిటల్ ఎడెమా అని కూడా అంటారు. అటువంటి లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో నిద్రలేమి కారణంగా కూడా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..