దాంపత్య జీవితంలో గొడవలు అనేవి సర్వసాధారణమైన విషయం. అయితే ఈ గొడవలు పరిధి దాటినప్పుడే అసలు సమస్య ఉంటుంది. గొడవలు కొంత కాలం వరకు బాగానే ఉన్నా అవి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం బంధం వీడిపోయే వరకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే బలాన్ని బలంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా కొన్ని రిలేషన్ టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తెలిసీ తెలియక చేసే తప్పులే వైవాహిక బంధాన్ని బలహీన పరుస్తాయని రిలేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి.? వాటి వల్ల వైవాహిక బంధంపై ఎలాంటి ప్రభావం పడుతుంది.? లాంటి వివరాలు మీకోసం..
* అబద్ధం అనేది ఎప్పటికీ అనర్థానికే దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భార్యభర్తల మధ్య అబద్ధాలు పెను ఉపద్రవానికి దారి తీస్తాయి. ఆనందరకరమైన బంధానికి నమ్మకమే తొలి అడుగని గుర్తుంచుకోవాలి. అబద్ధం ఎంతో కాలం దాగదు ఏదో ఒక సమయంలో అది బయట పడాల్సిందేనని గుర్తుంచుకోండి. ఆ రోజు బంధం తెగిపోవడం కూడా ఖాయం. అందుకే భాగస్వామి విషయంలో నిజాయతీగా ఉండడం ఉత్తమం.
* భార్యభర్తల మధ్య మూడో వ్యక్తికి ఎన్నడూ చోటు ఉండకూడదు. చాలా వరకు విడాకుల కేసుల్లో వివాహేతర సంబంధాలే కారణంగా చెబుతుంటారు. కాబట్టి వివాహ బంధం బలంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో మూడో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒక్కసారి వివాహ బంధంలో ఎంటర్ అయితే జీవితాంతం వారితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి.
* బంధాలు బలహీనంగా మారడానికి మరో కారణం ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించకపోవడం. గజిబిజీ జీవితంలో ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకునే వీలు లేదని వాదన వినిపిస్తుండొచ్చు. కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం బంధం బలహీన పడడం ఖాయమని రిలేషన్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారంలో ఒక్కరోజైనా అలా బయటకు వెళ్లడం లాంటివి చేయాలని చెబుతున్నారు.
* ఒకరిని ఒకరు గౌరవించుకోకపోవడం కూడా బంధం బలహీనపడడానికి కారణంగా చెప్పొచ్చు. చాలా వరకు భార్యభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోరు. మరీ ముఖ్యంగా నలుగురిలో తమ పాట్నర్‌ను అవమానపరుస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల బంధంపై భారీగా ప్రభావం పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..