Arthritis: కీళ్ల నొప్పులను నివారించే అద్భుతమైన చిట్కాలు.. ఇంట్లో లభించే వస్తువులతోనే..

మన భారతదేశంలో దాదాపు 180 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని లోవనీత్‌ బాత్రా తన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఆర్థరైటిస్ లో రెండు రకాలుంటాయని.. అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవి వివరించారు.

Arthritis: కీళ్ల నొప్పులను నివారించే అద్భుతమైన చిట్కాలు.. ఇంట్లో లభించే వస్తువులతోనే..
Knee Pain

Updated on: Feb 10, 2023 | 11:32 AM

కొన్నేళ్ల కిందటి వరకూ వయసుతో పాటు కొన్ని వ్యాధులు వస్తుండేవి. వాటిలో బీపీ, షుగర్‌, మోకాళ్లు, కీళ్ల నొప్పులు వంటివి ప్రధానంగా ఇబ్బంది పెడుతుండేవి. అయితే ప్రస్తుతం రోజులు మారాయి. ఆహార అలవాట్లు, ఆధునిక జీవన శైలి, శారీరక శ్రమలేని ఉద్యోగ జీవితం వంటి వాటికారణంగా చాలా రకాల జబ్బులు వయసుతో సంబంధం లేకుండా చుట్టుముడుతున్నాయి. వీటిల్లో ఎక్కువమంది ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య మోకాళ్లు, కీళ్ల నొప్పులు. చూసే వారికి పెద్ద సమస్యలా కనిపించకపోయినప్పటికీ అనుభవించే వారికి మాత్రం అది నిత్య నరకంగా అనిపిస్తుంది. విపరీతమైన నొప్పులతో, ఏ పనీ సరిగ్గా చెయ్యలేని పరిస్థితికి కారణం అవుతుంది. ఆర్థరైటిస్‌ అని పిలిచే ఈ వ్యాధిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు దీని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లోనే సింపుల్‌ చిట్కాలను వినియోగించి కూడా సాంత్వన పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా కీళ్ల నొప్పుల నుంచి పొందేందుకు ఉపయోగపడే కొన్ని మూలికలను పరిచయం చేస్తున్నారు. ఇవి మన వంటగదిలో తరచుగా కనిపించే వని ఆయన వివరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీపై ఓ వీడియో ను పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆర్థరైటిస్ అంటే..

కీళ్లు అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ గా చెబుతారు. సహజంగా ఇది వయసుతో పాటు వచ్చే సమస్య అయినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కదలకుండా ఒకేచోట కూర్చుని ఉన్న పరిస్థితులు యుక్తవయస్కుల్లోనూ కీళ్ల సమస్యకు ప్రధాన కారణం గా మారుతున్నాయి. ఏదైనా గాయం వల్ల లేదా శరీరంలో పోషకాహారలోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మన భారతదేశంలో దాదాపు 180 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని లోవనీత్‌ బాత్రా తన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఆర్థరైటిస్ లో రెండు రకాలుంటాయని.. అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవి వివరించారు. ఇవి రోగికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయని, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు విపరీతమైన నొప్పిని కలుగజేస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు మూలికలను ఆయన పరిచయం చేశారు. వీటిని రోజూ వాడటం ద్వారా ఈ కీళ్లను నొ‍ప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించారు. అవేంటో చూద్దాం..

కలబంద: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జెల్‌ లో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే ఆంత్రాక్వినోన్స్‌ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు (హల్ది): పసుపులోని ప్రధాన పదార్థం కర్కుమిన్, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కీళ్ల వాపు నుంచి ఉపశమనానికి ఇది ఉపకరిస్తుంది.

థైమ్: థైమ్ ఆకులలో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులకు మంచి మందుగా ఉపయోగపడతాయి.

అల్లం: అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ల్యూకోట్రైన్స్ అని పిలువబడే ఇన్ఫ్లమేటరీ అణువులను అణిచివేసేందుకు, అలాగే నొప్పి వాపునకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లను సంశ్లేషణ చేసే సామర్థ్యం ఉంటుంది.

వెల్లుల్లి: వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల ప్రభావాలను తగ్గిస్తుంది.

పెయిన్ కిల్లర్స్ వద్దే వద్దు..

అవకాశం ఉన్న ఉన్నంత వరకూ కీళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ శరీరంలోపలికి తీసుకోకపోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో బయోలాజికల్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. కీళ్లు వంగకుండా ఉండేందుకు ఇదొక అధునాతన చికిత్స. రోగ నిర్ధారణ జరిగిన 6 నెలల్లోపు చికిత్స చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..