Spider Facts: ఇంట్లో ఏ మూల చూసినా ఈ కీటకాలే ఉన్నాయా?.. కారణం మీరే కావచ్చు
మీ ఇంట్లో గోడలపైన, మూలల్లో, కిటికీల పైన తరచుగా సాలీడుల గూళ్ళు, వాటి బెడద కనిపిస్తోందా? నిరంతరం శుభ్రం చేస్తున్నా, అవి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయనే సందేహం మీకు కలగవచ్చు. సాలీడులు ఇంట్లోకి రావడం వెనుక కేవలం అపరిశుభ్రత మాత్రమే కాదు, వాతావరణం, వాటి జీవన చక్రానికి సంబంధించిన అనేక కారణాలు ఉంటాయి. మరి, సాలీడులు మీ ఇంటిని స్థావరంగా మార్చుకోవడానికి గల 7 ప్రధాన కారణాలు ఏమిటి? వాటి రాకను ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సాలీడులు ఇంట్లో తరచుగా కనిపించే జీవులు. ఇవి హానికరం కాకపోయినా, ఇంట్లో వాటి గూళ్ళు, వాటి ఉనికి ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని సార్లు ఇవి వాలిన చోట చర్మం దురద దద్దుర్లుగా మారుతుంది. ఇక చిన్న పిల్లలున్న ఇళ్లయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఇవి మీ ఇంటికి ఎందుకు వస్తాయి, వాటి రాక వెనుక గల 7 కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.
1. సంతానోత్పత్తి సమయం సంతానోత్పత్తి సమయంలో మగ సాలీడులు ఆడ సాలీడుల కోసం వలలు అల్లుతూ వెతుకుతుంటాయి. ఈ సమయంలో ఇంట్లో సాలీడులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
2. వెచ్చదనం కోసం చలి కాలంలో వెచ్చదనం కోసం సాలీడులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. చిన్న చిన్న సందుల ద్వారా, పగుళ్ల ద్వారా అవి ఇంటి లోపలికి సులభంగా చేరుకుంటాయి.
3. ఆహారం కోసం వేట సాలీడుల బెడద ఎక్కువ ఉంటే, ఆ స్థలంలో వాటికి ఆహారం (కీటకాలు, చిన్న పురుగులు) పుష్కలంగా ఉన్నట్లు అర్థం. ఆహారం దొరికే ప్రదేశాలలో ఇవి గూళ్ళు అల్లుకుని వేచి ఉంటాయి.
4. మారుతున్న వాతావరణం వాతావరణంలో మార్పులు తరచుగా వస్తున్నప్పుడు, సాలీడులకు సురక్షితమైన స్థలం అవసరం. అందుకే అవి ఆశ్రయం కోసం ఇంటి లోపలికి వస్తాయి.
5. తేమ అవసరం సాలీడులు జీవించడానికి తేమ అవసరం. గాలి తక్కువగా ఉండే చోట్ల, తేమ ఎక్కువగా ఉండే స్థలాలలో ఇవి స్థిరంగా వస్తాయి.
6. అపరిశుభ్ర స్థలాలు ఇంట్లో వస్తువులు చిందరవందరగా, ఒక చోట గుట్టగా పోసి ఉంటే, సాలీడులు దాగి ఉండటానికి సులువు అవుతుంది. అపరిశుభ్ర స్థలాలను ఇవి స్థావరాలుగా మలచుకుంటాయి. అందుకే ఇంటి శుభ్రతకు కొంచెం సమయం కేటాయించాల్సిందే.
7. లోపలే ఉండటానికి ఇష్టం కొన్ని రకాల సాలీడులకు బయట ఉండటం కంటే, ఇంటి లోపల ఉండటమే ఇష్టం. అందువల్ల అవి ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి.




