
పెళ్లిళ్ల మార్కెట్‌లో పిల్లలకు బదులు వారి తల్లిదండ్రులే చురుగ్గా పాల్గొంటారు. తమ పిల్లల వయసు, వృత్తి, ఎత్తు, విద్య, హాబీలు వంటి వివరాలతో కూడిన బయోడేటాలను పార్కులో ప్రదర్శనకు ఉంచుతారు. అటుగా వెళ్లే ఇతర తల్లిదండ్రులు ఆ ప్రొఫైల్స్ చూసి, నచ్చితే అక్కడికక్కడే చర్చలు జరిపి ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. ఇది అచ్చం పాతకాలపు అరేంజ్డ్ మ్యారేజ్ లాగే ఉన్నా, పబ్లిక్ పార్కులో జరగడమే విచిత్రం.
చైనాలో ఈ మ్యారేజ్ మార్కెట్లు 2000వ సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి. నేటికీ వీటి ఆదరణ తగ్గకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి
ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో ఒక యువకుడు తన తండ్రి తనను బలవంతంగా ఈ మార్కెట్‌కు తీసుకెళ్లిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ తండ్రి పార్కులోకి వెళ్లగానే వరుసగా ఉన్న బయోడేటాలను స్కాన్ చేసి, మూడు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేశాడట. అందులో ఒక అమ్మాయిని ఫైనల్ చేసి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి కొడుకు కోసం ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేశాడు.
ఈ మార్కెట్‌లో విదేశీయుల కోసం కూడా ప్రత్యేక విభాగాలు ఉండటం విశేషం. ప్రపంచం ఎంత డిజిటల్ మయం అయినా, పిల్లల పెళ్లి విషయంలో చైనా తల్లిదండ్రులు మాత్రం దేనినీ అదృష్టానికి వదిలేయడం లేదు. ఇంటర్నెట్ లోని యాప్స్ కంటే, తాము నేరుగా వెళ్లి చూసి నిర్ణయించడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు. మన దగ్గర మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు ఎలాగో, అక్కడ ఈ మ్యారేజ్ మార్కెట్లు అలా అన్నమాట!