Rosemary : నెట్టింట ట్రెండింగ్.. దీంతో నిజంగానే బట్టతలపై జుట్టు వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..

జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలన్నా దానికి అవసరమైన బాహ్య పోషణతో పాటు లోపలినుంచి మనం అందించే పోషకాలు కీలకం. రోజ్ మేరీ వాటర్ , ఆయిల్ ని జుట్టు కోసం చాలా కాలంగా వాడుతూనే ఉన్నారు. కానీ.. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా సెలబ్రెటీలందరూ వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది.

Rosemary : నెట్టింట ట్రెండింగ్.. దీంతో నిజంగానే బట్టతలపై జుట్టు వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..
Rosemery For Hair Growth Really Work

Updated on: Mar 30, 2025 | 2:18 PM

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోజ్ మేరీ వాటర్ గురించే వినిపిస్తోంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు దీని వాడకంపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు, సమాచారం కనపడుతోంది. ఎప్పటి నుంచో రోజ్ మెరీ ఆకులను నూనెలు, సౌందర్య లేపనాల్లో వాడుతున్నారు. కానీ ఇప్పుడే దీని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతే కాదు పలు కంపెనీలు కూడా వీటితో హెయిర్ సీరంలు, నూనెలు తయారు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. మరి నిజంగానే ఇది రాలిపోయిన జుట్టును తిరిగి మొలిపిస్తుందా.. దీనిపై నిపుణుల ఏమంటున్నారో చూద్దాం..

రోజ్మేరీ నీటిని జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తే దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు బలపడతాయని తద్వారా కొత్త జుట్టు వస్తుందని చెప్తున్నారు.. అసలు ఈ రోజ్ మేరీ వాటర్ ని ఎలా తయారు చేస్తారు..? దానిని ఎలా జుట్టుకి అప్లై చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం… రోజ్మేరీ నీరు, దాని పేరు సూచించినట్లుగా, తాజా రోజ్మేరీ ఆకులను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయబడిన సాధారణ ఇంకా శక్తివంతమైన కషాయం.

ఈ సుగంధ మూలికకు పెద్ద చరిత్రే ఉంది. పూర్వకాలం నుంచి దీన్ని ఎన్నో రకాల ఔషధాల్లో వాడుతున్నారు. జుట్టు సంరక్షణలో దీన్ని కీలకంగా చూపుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ఉంటాయి. ఈ వాటర్ ని జుట్టు కుదుళ్లకు రాసి , మంచిగా మసాజ్ చేయడం వల్ల.. జుట్టు బలంగా పెరుగుతుంది. కేవలం రోజ్ మేరీ వాటర్ మాత్రమే కాదు.. దీనితో తయారు చేసిన ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

రోజ్మేరీ ఆయిల్, సీరం, వాటర్ ఇలా మార్కెట్లో రకరకాల ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో ఇది కొంత వరకు మంచి రిజల్టే ఇస్తుంది. అయితే అసలు సమస్యంతా దీని ద్వారా బట్టతలమీద కూడా జుట్టు వస్తుందని కొందరు అపోహ పడుతున్నారు. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇది పూర్తి స్థాయిలో పనిచేయలేదు. తలలో రక్త ప్రవాహాన్ని పెంచడం, మంటను తగ్గించడం , ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించడం వంటి సామర్థ్యం దీనికి ఉన్నప్పటికీ బట్టతలపై ఇది రిజల్ట్ ఇస్తుందని నిరూపితం కాలేదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)