Poori: నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు నిజంగా పొంగుతాయా.?

కుక్కర్‌లో తక్కువ నూనెతో పూరీలు పొంగుతాయా.? గోధుమ పిండితో పూరీలను తయారు చేసి, అల్యూమినియం కుక్కర్‌లో తక్కువ నూనెతో వేయించారు. అవి పూర్తిగా పొంగకపోయినా, పర్వాలేదని, తక్కువ నూనెతో పూరీలు చేసుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి చూసేయండి.

Poori: నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు నిజంగా పొంగుతాయా.?
Poori

Updated on: Apr 08, 2026 | 8:31 PM

‘కుక్కర్‌లో తక్కువ నూనెతో పూరీలు చేయొచ్చా.’ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ట్రెండ్ మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటున్నారా.? అదేంటో ఇక్కడ తెలుసుకోండి. ముందుగా పూరీల తయారీ కోసం గోధుమ పిండిని కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టండి. అనంతరం ఒక పెద్ద చపాతీలా ఒత్తుకుని, పదునైన అంచులు గల డబ్బాతో గుండ్రటి ఆకారంలో పూరీలను కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ పూరీలు సమానంగా వస్తాయి. అనంతరం ఈ పూరీలను అల్యూమినియం కుక్కర్‌లో కొద్దిపాటి నూనె వేసి వేయించండి.

ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

ఇక వైరల్ అయిన ట్రెండ్ ప్రకారం పూరీలు అద్భుతంగా ఏమీ పొంగవు. పూరీలు సగం పొంగి, సగం పొంగనట్లుగా వస్తాయి. సాధారణంగా కళాయిలో డీప్ ఫ్రై చేసినప్పుడు వచ్చేంతగా ఇవి పొంగవు. నూనె విషయానికొస్తే, ఆయిల్ అస్సలు పీల్చుకోదని చెప్పలేం కానీ, సాధారణ పద్ధతి కంటే తక్కువ నూనెతోనే వీటిని తయారు చేయవచ్చు. చివరగా, రుచి విషయంలో ఇవి సాధారణంగానే అనిపిస్తాయి. నూనె పదార్థాలు ఎక్కువగా ఇష్టపడని వారికి ఇది ఒక ప్రత్యామ్నాయ ఆప్షన్ అని చెప్పవచ్చు. కుక్కర్‌లో పూరీలు చేయడం సాధ్యమే కానీ, అవి డీప్ ఫ్రై చేసిన పూరీల్లా పూర్తిగా పొంగవు. కొంత నూనెను ఖచ్చితంగా పీల్చుకుంటాయి.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us