AC Side Effects: రోజంతా ఏసీలోనే ఉంటున్నారా.. మీకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఈ కారణంగా ఎయిర్ కండిషనర్ల వాడకం చాలా పెరిగింది. ఇప్పటికే ఏసీల వాడకం అలవాటు ఉన్నవారు ఇవి లేకుండా ఒక్క క్షణం ఉండలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా కారులో ప్రయాణించినా కొందరికీ ఏసీ కచ్చితంగా ఉండాల్సిందే. ఇక అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఏసీ వాతావరణానికి అలవాటు పడితే ఆ తరవాత అది లేకుండా ఉండలేరు. ఇలా ప్రతి ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే దీనిని వాడేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూలర్ల కన్నా ఏసీలే దర్శనమిస్తున్నాయి. అయితే, ఎంత ఎండాకాలమైనా ఏసీలను లిమిట్ వరకే వాడాలంటున్నారు నిపుణులు. లేదంటే వీటి కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వవ్చే ప్రమాదముందని అంటున్నారు.

AC Side Effects: రోజంతా ఏసీలోనే ఉంటున్నారా.. మీకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ
Ac Side Effects

Updated on: Feb 21, 2025 | 8:48 PM

ఏసీ గాలిని నిరంతరం పీల్చడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఇవి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తాయంటున్నారు. ఏసీని మితంగా వాడితేనే మంచిదని హెచ్చరిస్తున్నారు. వీటి కారణంగా ఈ వ్యాధులు రాకుండా చూసుకోవాలంటున్నారు. ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని తలుపులు, కిటికీలతో పాటు మిగిలిన అన్ని ఓపెనింగ్‌లను పూర్తిగా మూసివేయాలి. ఏసీ మెరుగ్గా పనిచేయడానికి, మీ గది వేగంగా చల్లబడటానికి, ఫిల్టర్‌లను తరచూ శుభ్రం చేయాలి. గది తగినంతగా చల్లబడటం లేదని మీరు భావిస్తే, వెంటనే ఫిల్టర్లను శుభ్రం చేయాలి. ఫ్యాన్‌ని కూడా లోస్పీడ్ లో ఉంచడం మంచిది. కూలింగ్ గది మొత్తం త్వరగా విస్తరించడానికి ఇది సాయంపడుతుంది. ఏసీ గది చల్లగా ఉండటానికి లైట్లను ఆఫ్ చేయాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి ఉన్నా వెంటనే వాటిని కూడా ఆఫ్ చేయాలి. పెద్ద గదిలో తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను ఉంచితే కూడా కూలింగ్ అంత మెరుగ్గా ఉండదు.

సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి..

ఎయిర్ కండిషనర్ వాడటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మీ చర్మం కూడా దెబ్బతింటుంది. కాబట్టి, మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఏసీ కి బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించాలి. ఏసీ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుంటే వెంటనే మీరు దీని వాడకాన్ని తగ్గించేస్తారు.

ఆస్తమా..

ఏసీ కారణంగా, ఆస్తమా వంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. మీరు ఆస్తమా బాధితులైతే ఎక్కువసేపు ఏసీలో ఉండకుండా ఉండాలి.

డీహైడ్రేషన్

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ వస్తుంది. వేసవిలో ఈ సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.

అలెర్జీ రినైటిస్

అలెర్జీ రినైటిస్‌కు ప్రధాన కారణం ఏసీలో ఎక్కువ సమయం గడపడం అని మీకు తెలుసా.. అందుకే ఏసీలో ఎక్కువసేపు కూర్చోకుండా ఇతర మార్గాల ద్వారా ఇంటిని చల్లబరుచుకోవాలి.

ఇన్ఫెక్షన్ ప్రమాదం

ఎయిర్ కండిషనర్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ గాలి శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లో చేరి సమస్యలు తేగలదు.

తలనొప్పి

ఏసీ వాడకం మరీ ఎక్కువైతే కొందరిలో తలతిరగడం, వాంతులు లేదా తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

పొడి చర్మం

ఏసీ గాలి మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. నిజానికి, ఎక్కువసేపు ఎయిర్ కండిషనర్‌లో కూర్చోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి, మీరు ఏసీ కి బదులుగా ఇండోర్-అవుట్‌డోర్ మొక్కలు, కర్టెన్లను ఉపయోగించాలి. ఇది మీ గది ఇంటికి సహజ చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే, ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత ఏసీ ని స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.