Health Tips: నిద్రమాత్రలకు బదులుగా ఆ పండ్లు..? నెట్టింట కొత్త ట్రెండ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

అరటి పండ్లు ఎన్నో రకాల పోషక విలువలు కలిగి ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే, వీటిలో మనకెవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ కూడా ఉందట. నెట్టింట దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే .. అరటిపండ్లను నిద్రలేమికి విరుగుడుగా కూడా వాడొచ్చంటున్నారు. అలా చేస్తే ఏ మాత్రలూ అవసరం లేదట. మరి దీనిపై వైద్య నిపుణుల ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..

Health Tips: నిద్రమాత్రలకు బదులుగా ఆ పండ్లు..?  నెట్టింట కొత్త ట్రెండ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
మంచి గాఢ నిద్ర కోసం బెడ్‌పై ఎలాంటి దిండును ఉపయోగించాలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. నిద్రపోయేటప్పుడు మెడ లేదా భుజాలు వంగకుండా దిండు ఎత్తు ఉండాలని నిపుణులు అంటున్నారు. అలాగే దిండుపై వెల్లకిలా పడుకోవాలి.

Updated on: Apr 09, 2025 | 3:38 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. రాత్రి పడుకునే ముందు అరటిపండు తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు ఉండడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ పోషకాలు శరీరాన్ని రిలాక్స్ చేసి, నిద్రను మెరుగుపరుస్తాయని అంటున్నారు. కానీ, ఇది నిజంగా పని చేస్తుందా? నేషన మెడిసిన్ నుంచి వచ్చిన ఒక అధ్యయనం దీనిపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అరటిపండు ఎలా సహాయపడుతుంది?

అరటిపండులోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్‌గా మారి నిద్రకు సహాయపడుతుందని చెబుతారు. అలాగే, పొటాషియం, మెగ్నీషియం కండరాలను సడలించి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కారణాల వల్ల చాలా మంది రాత్రి అరటిపండు తింటే నిద్ర లోతుగా, హాయిగా వస్తుందని నమ్ముతారు.

అధ్యయనం ఏం చెప్పింది?

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, అరటిపండు తినడం వల్ల కొంత మేరకు ప్రయోజనం ఉంటుందని, కానీ అది అందరికీ ఒకేలా పని చేయదని తేలింది. ఆహారపు అలవాట్లు, నిద్ర వాతావరణం, వ్యక్తిగత జీవనశైలి వంటివి నిద్ర నాణ్యతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయట. కొందరికి అరటిపండు తినడం వల్ల స్వల్పంగా ఉపయోగం ఉండొచ్చు, కానీ ఇది నిద్రమాత్రల్లా అద్భుతంగా పని చేస్తుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కొందరికి ఇది మానసికంగా సంతృప్తినిచ్చే “ప్లసీబో ఎఫెక్ట్” కావచ్చని కూడా వారు సూచిస్తున్నారు.

అరటిపండు తినాలా? వద్దా?

అరటిపండు ఆరోగ్యకరమైన ఆహారం అనడంలో సందేహం లేదు. రాత్రి తినడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ, దీన్ని నిద్ర సమస్యలకు పరిష్కారంగా పూర్తిగా ఆధారపడకూడదు. మీరు ఇప్పటికే మంచి నిద్ర అలవాట్లు పాటిస్తుంటే, అరటిపండు ఒక చిన్న అదనపు ప్రయోజనం ఇవ్వొచ్చు. కానీ రాత్రంతా ఫోన్ చూసి, ఒత్తిడితో ఉండి, కేవలం అరటిపండు తింటే నిద్ర పడుతుందనుకుంటే అది అంత సులభం కాదు.

మంచి నిద్రకు ఇది ముఖ్యం..

అరటిపండు రాత్రి తినడం ఒక ఆసక్తికరమైన ఆలోచన, కానీ అది అందరికీ సరిపడే సమాధానం కాదు. మంచి నిద్ర కోసం సమతుల ఆహారం, క్రమం తప్పని షెడ్యూల్, ఒత్తిడి లేని మనసు చాలా ముఖ్యం. మీరు ఈ ట్రెండ్‌ను ప్రయత్నించాలనుకుంటే, ఒకసారి ట్రై చేసి చూడండి. దీని వల్ల ప్రయోజనాలే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.