Ten Causes of Liver Damage : మన శరీరంలో ఉన్న అవయవాలలో అతి పెద్దది లివర్. ఇది జీర్ణ క్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని మనకు తెలుసు. అలాంటి ఆహారం వలన లివర్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది మరియు మనం పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
1. చక్కెర లేదా తీపి ఉన్న పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన కాలేయం దెబ్బ తింటుంది. చక్కెర కాలేయంలో పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది, తత్ఫలితంగా కొద్ది కాలానికి లివర్ పనితీరు మందగిస్తుంది.
2. తాజాగా ఆహార పదార్థాలను రుచిగా చేయడానికి వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ అనే పదార్థాన్ని మిక్స్ చేస్తున్నారు. ఆ ఆహారాన్ని తిన్నప్పుడు ఆ పదార్థం లివర్‌పై ప్రభావం చూపడంతో లివర్ చెడిపోయే అవకాశం ఉంది.
3. మన శరీరంలో విటమన్ ఏ లోపం ఏర్పిడినప్పుడు కంటి చూపుతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఆ విటమిన్‌ని సంతులనం చేయడానికి మనం దానిని తీసుకుంటాం కానీ శరీరంలో మోతాదుకి మించి విటమిన్ ఏ ఉన్నట్లయితే దాని ప్రభావం లివర్‌పై పడి ఆ అవయవం క్షీణిస్తుంది.
4. కూల్‌డ్రింక్స్‌ని ఎక్కువగా తాగటం వలన వాటిలో ఉన్న రసాయన పదార్థాలు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
5. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. ఉప్పు వలన రక్తపోటు రావటమే కాక చిప్స్ వంటి పదార్థాలను తినడం వలన వాటిలోని విష పదార్థాలు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిది.
6. స్థూలకాయం ఉన్నవారు కూడా లివర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఆవకాశం ఉంది. అనేక సందర్భాలలో లివర్ ఫెయిల్ అవుతుంది.
7. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారిలో లివర్ సమస్యలు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువ.
8. యాంటీ డిప్రెస్సెంట్స్, మూడ్ స్టెబిలైజర్స్, కార్టికోస్టెరాయిడ్స్, పెయిన్ రిలీవర్స్ వంటి పలు రకాల మందులను దీర్ఘ కాలంపాటు వాడినా లివర్ చెడిపోతుంది. డాక్టరు సిఫార్సు లేకుండా అంటువంటి మందులను సొంతంగా వాడకండి.
9. క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమోథెరఫీ కారణంగా కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు వాటిని గుర్తించి సరైన సమయంలో చికిత్స పొందకపోయినా లివర్‌కి హాని కలిగే అవకాశం ఉంది.
10. పేగుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి చికిత్స చేయించుకోకుండా ఆలస్యం చేసినా లివర్ దెబ్బతింటుంది. పొలాల్లో కీటక నాశినిని వాడి పండించిన కూరగాయలను తిన్నా లివర్ సమస్యలు తలెత్తుతాయి.
10. పేగుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి చికిత్స చేయించుకోకుండా ఆలస్యం చేసినా లివర్ దెబ్బతింటుంది. పొలాల్లో కీటక నాశినిని వాడి పండించిన కూరగాయలను తిన్నా లివర్ సమస్యలు తలెత్తుతాయి.