AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Proverb: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఈ సామెత అర్థం తెలుసా?

Telugu Proverb Meaning: మన పెద్దల కాలం నుంచి వాడుకలో ఉన్న తెలుగు సామెతలకు లోతైన అర్థాలు అంటాయి. ఇవి జీవిత సత్యాలను తెలియజేస్తాయి. అలాంటి సామెతల్లో ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాన్ని, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది. అసలు ఈ సామెత వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఏయే సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తారు? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసుకుందాం.

Telugu Proverb: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఈ సామెత అర్థం తెలుసా?
Telugu Samethalu MeaningImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Oct 16, 2026 | 12:28 PM

Share

తెలుగు సామెత అర్థం: తెలుగు భాషలో సామెతలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సామెతల్లో లోతైన అర్థం ఇమిడి ఉంటుంది. మన పెద్దలు తమ జీవిత అనుభవాల నుంచి ఎన్నో సామెతలను రూపొందించారు. తక్కువ పదాల్లోనే లోతైన జీవిత సత్యాలు, నీతి, అనుభవాలను తెలియజేయడం సామెతల ప్రత్యేకత. అలాంటి అర్థవంతమైన సామెతల్లో ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనేది ఒకటి. అసలు ఈ సామెతలోని అంతరార్థం ఏమిటి? ఏ సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

సామెత అర్థం

ఒక ముల్లు శరీరంలో గుచ్చుకున్నప్పుడు సున్నితమైన చేతి వేళ్లతో దాన్ని తొలగించడం సాధ్యంకాదు. ఆ ముల్లును తొలగించడానికి కొన్నిసార్లు మరో ముల్లు సాయంతోనో లేదా పదునైన వస్తువు ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఒక సమస్యను పరిష్కరించడానికి ఆ సమస్యకు తగిన మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఒకరిని ఇబ్బంది పెడుతున్న సమస్యను పరిష్కరించాలంటే, ఆ సమస్యకు కారణమైన పరిస్థితులను అర్థం చేసుకుని తగిన వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెతనే కొన్ని సందర్భాల్లో ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటుంటారు.  దీనికి సమానమైన ఇంగ్లీష్ సామెత Fight fire with fire (అగ్నితో అగ్నిని ఎదుర్కోవడం) ఉంది.

కొన్ని సందర్భాల్లో ఈ సామెతను శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే అర్థంతోనూ వాడుతుంటారు. మనల్ని మోసంతో జయించిన వారిని అదేరకంగా మోసం చేసి జయించాలని.. ముల్లును ముల్లుతోనే తీయాలని కొన్ని సందర్భాల్లో ఈ సామెతను వాడటం వింటూనే ఉంటాము. అయితే, ఈ సామెతను ప్రతీకారానికి లేదా ఇతరులకు హాని చేయడానికి ప్రోత్సాహంగా భావించకూడదు. జీవితంలో ఎదురయ్యే సమస్యకు తగిన పరిష్కారాన్ని తెలివిగా ఎంచుకోవడమే ఈ సామెత ప్రధాన ఉద్దేశం.

ఇవి కూడా చదవండి

ఈ సామెతను ఎప్పుడు వాడాలి

ఒక వ్యక్తి తన వ్యాపారంలో ఎదురవుతున్న పోటీని అధిగమించాలని అనుకున్నాడు. అతను ఇతరులను విమర్శించడం కాకుండా, మెరుగైన సేవలు అందించడం, వ్యాపార పోటీదారులను మించి కొత్త వ్యూహాలు అమలు చేయడం ద్వారా పోటీని ఎదుర్కొంటాడు. ఇలాంటి సందర్భంలో ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనే సామెతను వాడుతారు. అలాగే, క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి సాధారణ మార్గాలు పనిచేయనప్పుడు, పరిస్థితికి తగిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

సామెతలోని నీతి

ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం ఉండదు. పరిస్థితిని అర్థం చేసుకుని, తెలివిగా సరైన మార్గాన్ని ఎంచుకుంటే క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

Follow Us
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఈ సామెత అర్థం తెలుసా?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఈ సామెత అర్థం తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్.. వీడియో
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్.. వీడియో
దుర్గాదేవి చేతిలోని దివ్య ఆయుధాల వెనుక రహస్యం ఇదే.. ఒక్కో ఆయుధం..
దుర్గాదేవి చేతిలోని దివ్య ఆయుధాల వెనుక రహస్యం ఇదే.. ఒక్కో ఆయుధం..
అమ్మమ్మల నాటి ఉల్లివెల్లుల్లి కారం ఫ్రై.. వేడిఅన్నంలో అదిరిపోద్ది
అమ్మమ్మల నాటి ఉల్లివెల్లుల్లి కారం ఫ్రై.. వేడిఅన్నంలో అదిరిపోద్ది
ఒక్క గ్లాస్ తాగితే వీక్ అయిన నరాలు కూడా చురుకుగా మారుతాయి..
ఒక్క గ్లాస్ తాగితే వీక్ అయిన నరాలు కూడా చురుకుగా మారుతాయి..
బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి చేదువార్త.. అలా చేయలేరు..
బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి చేదువార్త.. అలా చేయలేరు..
శత వసంతాల సంబరం.. నర్సవ్వకు ఘన సత్కారం!
శత వసంతాల సంబరం.. నర్సవ్వకు ఘన సత్కారం!
చేపల ఫ్రై రుచితో కరకరలాడే వంకాయ మసాలా ఫ్రై.. ఒక్కసారి తింటే వదలరు
చేపల ఫ్రై రుచితో కరకరలాడే వంకాయ మసాలా ఫ్రై.. ఒక్కసారి తింటే వదలరు
ఉత్సాహంగా ప్రారంభమైన టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2026..
ఉత్సాహంగా ప్రారంభమైన టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2026..
భారత్-జింబాబ్వే టీ20 మ్యాచ్‌లకు ఫ్రీ ఎంట్రీ
భారత్-జింబాబ్వే టీ20 మ్యాచ్‌లకు ఫ్రీ ఎంట్రీ