AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీజీ పాటించిన ఈ అలవాట్లు మీలో ఉంటే.. తిరుగులేని విజయం మీదే!

Mahatma Gandhi Simple Habits: మహాత్మా గాంధీ బోధనల్లోని మంచి విషయాలను మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలి. మీ జీవితాన్ని మార్చేసే అలవాట్ల కోసం చిన్న మార్పులతో ప్రారంభించాలి. జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే ప్రతిసారీ పెద్ద నిర్ణయాలే తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజూ చేసే చిన్న మంచి పనులే కాలక్రమేణా మన జీవనశైలిని మెరుగుపరచగలవు. మహాత్మా గాంధీ జీవితం, విలువల నుంచి స్ఫూర్తి పొందిన సాధారణ జీవనశైలి సూచనలను మీ జీవితానికి ఆపాదించుకునేందుకు ప్రయత్నించండి.

గాంధీజీ పాటించిన ఈ అలవాట్లు మీలో ఉంటే.. తిరుగులేని విజయం మీదే!
Mahatma Gandhi Simple HabitsImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Oct 13, 2026 | 1:05 PM

Share

జాతిపిత మహాత్మా గాంధీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. నిరాడంబరమైన జీవనం, క్రమశిక్షణ, అహింస, పనిని గౌరవించడం వంటి ఆయన సూత్రాలు నేటి ఆధునిక జీవితంలోనూ ఎంతో ఉపయోగపడతాయి. రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు.  అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున జాతిపితను స్మరించుకుకోవడంతో పరిమితం కాకుండా ఆయన అనుసరించిన విలువలను మన జీవితానికి నిత్యం ఆపాదించుకోవడానికి ప్రయత్నించాలి. నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్, సోషల్ మీడియా అతి వినియోగం, పని ఒత్తిడి, ఇతరులతో పోల్చుకునే ధోరణి పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాంధీజీ జీవన విధానంలోని కొన్ని సూత్రాలను ఆచరించడం ద్వారా మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవచ్చు. గాంధీజీ అలవాట్ల నుంచి (Mahatma Gandhi Simple Habits) మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1. నిరాడంబరమైన జీవితాన్ని గడపండి

మహాత్మా గాంధీ నిరాడంబరమైన జీవన విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. మనకు నిజంగా అవసరమైన వస్తువులు ఏవి? కేవలం ఇతరులను చూసి కొనుగోలు చేస్తున్నవి ఏవి? అనే విషయాలను గుర్తించడం ముఖ్యం. ప్రస్తుత కాలంలో కొత్త వస్తువులు, ఫ్యాషన్ ట్రెండ్స్, ఖరీదైన జీవనశైలి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అలాంటి సమయంలో అవసరాలకు, కోరికలకు మధ్య తేడాను తెలుసుకోవాలి. అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండటం, ఇంటిని క్రమబద్ధంగా ఉంచుకోవడం, దినచర్యను సరళంగా మార్చుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకునే వీలుంటుంది.

2. మీరు తీసుకునే ఆహారం, సమాచారంపై శ్రద్ధ పెట్టండి

గాంధీజీ ఆహారపు అలవాట్లకు, ఆహార నియమాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆరోగ్యం, ఆత్మనిగ్రహం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఈ సూత్రాన్ని నేటి జీవితానికి అన్వయించుకుని మనం తీసుకునే ఆహారంతో పాటు చూసే వీడియోలు, చదివే వార్తలు, సోషల్ మీడియాలో గడిపే సమయంపై కూడా నియంత్రణ పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం, అవసరానికి మించి ఫోన్ ఉపయోగించకపోవడం, ఉపయోగకరమైన సమాచారానికే ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.

3. ఆలోచించడానికి సమయం కేటాయించండి

పని, కుటుంబ బాధ్యతలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మధ్య ప్రశాంతంగా కాసేపు ఆలోచించడానికి సమయం దొరకడం కష్టంగా మారింది. కానీ మన లక్ష్యాలు, ప్రాధాన్యాలు, నిర్ణయాల గురించి ఆలోచించుకోవడం ఎంతో అవసరం. గాంధీజీ తన దినచర్యలో ప్రార్థన, ఆత్మపరిశీలన వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం కూడా ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండి మన గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఏ పనికి ప్రాధాన్యం ఇవ్వాలో స్పష్టత పొందవచ్చు.

4. క్రమశిక్షణను అలవాటు చేసుకోండి

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే ఒక్కరోజు ఉత్సాహం సరిపోదు. నిరంతర ప్రయత్నం, క్రమశిక్షణ అవసరం. గాంధీజీ జీవితం ఈ విషయాన్ని గుర్తుచేస్తుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, డబ్బును పొదుపు చేయడం, పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయడం వంటి చిన్న అలవాట్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఒకేసారి అన్ని అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించకుండా, ముందుగా ఒక మంచి అలవాటును ఎంచుకుని దానిని క్రమం తప్పకుండా పాటించాలి.

5. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి

అహింస, సంయమనం గాంధీజీ బోధనల్లో ముఖ్యమైనవి. ఈ విలువలు నేటి సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఎంతో అవసరం. ఎవరైనా మనకు కోపం తెప్పించే సందేశం పంపినప్పుడు వెంటనే స్పందించడం, ఆవేశంతో వ్యాఖ్యలు చేయడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొంత సమయం తీసుకుని ఆలోచించిన తర్వాత స్పందించడం మంచిది. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించకపోయినా గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మాటలతో ఇతరులను బాధపెట్టకుండా ఉండటం కూడా అహింసలోని ముఖ్యమైన భావనకు అనుగుణంగా ఉంటుంది.

6. చేసే ప్రతి పనిని గౌరవించండి

గాంధీజీ శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించారు. ఏ పని చిన్నదనే భావనతో దానిని తక్కువగా చూడకూడదు. సమాజానికి ఉపయోగపడే ప్రతి నిజాయితీతో కూడిన పనికి విలువ ఉంటుంది. ఆఫీసులో పనిచేసేవారు, ఇంటి బాధ్యతలు చూసుకునేవారు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాపారులు.. ఇలా ప్రతి ఒక్కరి కృషి సమాజానికి అవసరమే. ఉద్యోగ హోదా, జీతం, ఆస్తిపాస్తుల ఆధారంగా వ్యక్తుల విలువను నిర్ణయించకూడదు. ఇతరుల పనిని గౌరవించడంతో పాటు మనం చేసే పనిని కూడా నిబద్ధతతో చేయాలి.

7. ఇతరులతో పోల్చుకోకండి

సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల విజయాలు, సంపద, జీవనశైలిని చూసి తమ జీవితాన్ని పోల్చుకునే ధోరణి పెరిగింది. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి, అసంతృప్తి కలిగే అవకాశముంది. గాంధీజీ తన నమ్మకాలు, విలువలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించారు. ప్రతి ఒక్కరూ సమాజాన్ని మార్చే గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబానికి సమయం కేటాయించడం, నిజాయితీగా పనిచేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పర్యావరణాన్ని కాపాడటం వంటి చిన్న లక్ష్యాలు కూడా జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. ఇతరులు ఏమి సాధించారనే దానికంటే మనం ఏం నేర్చుకుంటున్నాం, మన లక్ష్యాల దిశగా ఎంత ముందుకు వెళ్తున్నాం అనే విషయాలపై దృష్టి పెట్టాలి.

Follow Us
గాంధీజీ ఆచరించిన ఈ అలవాట్లు మీ జీవితాన్నే మార్చగలవు..!
గాంధీజీ ఆచరించిన ఈ అలవాట్లు మీ జీవితాన్నే మార్చగలవు..!
అరచేతిలో శని రేఖ తెగిపోయిందా? జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో..
అరచేతిలో శని రేఖ తెగిపోయిందా? జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో..
మహిళలు ఇంట్లోనే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? బెస్ట్ ఆప్షన్..
మహిళలు ఇంట్లోనే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? బెస్ట్ ఆప్షన్..
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..