Tea Tips: టీతో స్నాక్స్ తినే అలవాటుందా?… 99 శాతం మంది చేసే పొరపాటు ఇదే..

టీ చాలా మందికి కేవలం పానీయం కాదు, ఒక అనుభూతి. కాలం ఏదైనా, వేడి వేడి టీని ఆస్వాదించడం చాలామందికి అలవాటు. ఇది తక్షణ ఉపశమనాన్ని, శక్తిని ఇస్తుంది. ఉదయం పూట టీ తాగితేనే కొందరికి పనులు వేగంగా సాగుతాయి. అయితే, చాలా మంది టీతో పాటు ఏదో ఒక స్నాక్ తినడం అలవాటు. మిక్చర్, టోస్ట్, బ్రెడ్, బిస్కెట్స్ లాంటివి టీతో తినడానికి రుచిగా ఉన్నా, వీటి వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు పెద్దవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tea Tips: టీతో స్నాక్స్ తినే అలవాటుందా?... 99 శాతం మంది చేసే పొరపాటు ఇదే..
Tea With Snacks Side Effects

Updated on: Jul 17, 2025 | 3:29 PM

టీ చాలా మందికి ఒక ఎమోషన్. కాలం ఏదైనా, వేడి వేడి టీని ఆస్వాదించడం చాలామందికి అలవాటు. ఇది తక్షణ ఉపశమనాన్ని, శక్తిని ఇస్తుంది. ఉదయం పూట టీ తాగితేనే కొందరికి పనులు వేగంగా సాగుతాయి. అయితే, చాలా మంది టీతో పాటు ఏదో ఒక స్నాక్ తినడం అలవాటు. మిక్చర్, టోస్ట్, బ్రెడ్, బిస్కెట్స్ లాంటివి టీతో తినడానికి రుచిగా ఉన్నా, వీటి వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు పెద్దవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీతో నమ్‌కిన్ (మిక్చర్):
మిక్చర్, మురుకులు, చెగోడీలు లాంటి ఉప్పు, కారం, నూనెలతో తయారైన స్నాక్స్‌ను టీతో కలిపి తీసుకోవడం సాధారణం. వీటిలో అధికంగా ఉండే ఉప్పు, నూనెలు, చక్కెరతో కూడిన టీ కలయిక కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది.

బ్రెడ్:
తెల్ల బ్రెడ్ ఎక్కువగా మైదాతో తయారవుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికం, పోషకాలు తక్కువ. టీతో దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఇది శరీరంలో కొవ్వు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్, పేరుకుపోవడానికి దారితీస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు ఈ కలయికను మానుకోవడం మంచిది.

టీతో సమోసా:
రుచికి ఎంతగానో నచ్చే సమోసా, టీతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై భారం పడవచ్చు. ఇది లోతైన నూనెలో వేయించిన, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం. దీని వల్ల ఆమ్లత్వం పెరిగి, కడుపులో అసౌకర్యం కలుగుతుంది. ఈ కాంబినేషన్‌ను కూడా నివారించడం శ్రేయస్కరం.

బిస్కెట్స్:
టీతో ఎక్కువగా తినే స్నాక్స్‌లో బిస్కెట్స్ ఒకటి. మార్కెట్లో అనేక రకాల బిస్కెట్స్ లభిస్తాయి. బిస్కెట్స్‌ను ఎక్కువగా మైదా, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో తయారు చేస్తారు. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల మన శరీరంలో అదనపు కేలరీలు చేరి, నడుము చుట్టుకొలత పెరుగుతుంది.

టోస్ట్:
టీతో టోస్ట్ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. టోస్ట్ క్రంచీగా, తీయగా ఆకర్షణీయంగా ఉన్నా, ఇది ప్రధానంగా మైదాతో తయారవుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలు ఉండవు. పైగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనితో తిన్న వెంటనే చక్కెర పెరుగుదలకు దారి తీస్తుంది. దీంతో త్వరగా అలసిపోయినట్లుగా ఉంటుంది. వీటిని తినకపోవడం మంచిది.

మరి ఏం తినాలంటే?
అన్నింటినీ వద్దంటున్నప్పుడు, మరి టీతో ఏమి తినాలి అనే సందేహం రావచ్చు. టీతో పాటు హోల్ గ్రెయిన్స్ (తృణధాన్యాలు), ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల పైన పేర్కొన్న సమస్యలను నివారించవచ్చు.