Insulin Plant: డయాబెటీస్‌ పేషెంట్స్ రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ ఆకుల‌ను తింటే.. ఎంత‌టి షుగ‌ర్ అయినా స‌రే మటుమాయమే..

|

Jan 05, 2023 | 3:25 PM

కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఉప‌యోగించి స‌హ‌జ సిద్దంగా మ‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మొక్క‌ల్లో ఇన్సులిన్..

Insulin Plant: డయాబెటీస్‌ పేషెంట్స్ రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ ఆకుల‌ను తింటే.. ఎంత‌టి షుగ‌ర్ అయినా స‌రే మటుమాయమే..
Insulin Plant For Sugar Patients
Follow us on

ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమ‌స్యల్లో డయాబెటీస్ కూడా ఒక‌టి. ఒక్కసారి ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం ఇబ్బంది ప‌డాల్సిందే. అదే క్రమంలో త‌ర‌చూ ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకుంటూనే ఉండాలి. అంతేకాక ఈ సమస్యతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో మార్పులు, ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతో పాటు ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. ఎటువంటి శ్ర‌మ లేకుండా, అధిక బ‌రువు ఉండే వారు కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కొంద‌రు షుగ‌ర్ వ్యాధికి గురవుతుంటారు. ఇక కొందరిలో అయితే  మందులు వాడి ఎంత ప్ర‌య‌త్నించినా కూడా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండ‌దు. అయితే కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఉప‌యోగించి స‌హ‌జ సిద్దంగా మ‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మొక్క‌ల్లో ఇన్సులిన్ ప్లాంట్ ఒక‌టి.  మనం ఇన్సులిన్ మొక్కలోని పోషకాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే.. దీని ఆకులలో అనేక రకాల ప్రోటీన్లు, టెర్పెనాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ ఆమ్లం, ఇనుము, బి-కెరోటిన్, కరోసోలిక్ ఆమ్లం తదితర ఇతర పోషకాల పుష్కలంగా ఉంటాయి.

షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇన్సులిన్ మొక్క అద్భుతంగా ప‌ని చేస్తుంది. అందుకే ఈ మొక్క‌కు ఆ పేరు వ‌చ్చింది. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా వ‌చ్చే ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ఇన్సులిన్ మొక్క‌లో ఉండే ర‌సాయ‌నాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త్వ‌ర‌గా త‌గ్గిస్తాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగేలా కూడా చేస్తాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒక‌టి చొప్పున తిన‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగ‌ర్‌నైనా అదుపులో పెంచుకోవ‌చ్చు. అయితే ఈ మొక్క ఆకుల‌ను గ‌ర్భిణీ స్త్రీలు, పాలిచ్చే త‌ల్లులు అస్స‌లు తీసుకోకూడ‌దు. అలాగే షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మ‌రో మొక్క పొడ‌ప‌త్రి మొక్క‌. ఇది తీగ జాతికి చెందిన బ‌హు వార్షిక మొక్క‌. ఇది ఎక్క‌డ పడితే అక్క‌డ పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని సంస్కృతంలో ‘మేష శృంగి’ అని పిలుస్తారు.

అంతేకాకుండా పుట్ట భ‌ద్ర‌, మ‌ధునాశిని అని కూడా పిలుస్తారు. పొడ‌ప‌త్రి మొక్క పూలు గుండ్రంగా ప‌సుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా చేదుగా ఉంటాయి. అయితే షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఈ మొక్క ఆకులు చ‌ప్ప‌గా ఉంటాయి. వ్యాధి లేని వారికి మాత్రమే ఈ మొక్క ఆకులు చేదుగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను నేరుగా తిన్నా లేదా వాటితో క‌షాయాన్ని చేసుకుని తాగినా కూడా షుగ‌ర్ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పొడ‌ప‌త్రి మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. ఆస్థ‌మా వ్యాధి త‌గ్గు ముఖం ప‌డడమేకాక జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. స్త్రీలు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాలు తొల‌గిపోతాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ విధంగా ఈ మొక్క‌ల ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా షుగ‌ర్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..