Garlic Benefits: ఏంటి ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే.. ఇన్ని ప్రయోజనాలా.. రోజూ ఒకటి తింటే…

Benefits of Eating a Raw Garlic Clove: వెల్లుల్లి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మందికి తెలుసు కానీ.. ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏమిటంటే.. వెల్లుల్లిని ఏ సమయంలో తినాలి.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం సరైనదేనా అని?.. కాబట్టి ఇప్పుడు మనం వెళ్లుల్లి ఖాళీ కడుపుతో తినడం సరైదేనా.. తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Garlic Benefits: ఏంటి ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే.. ఇన్ని ప్రయోజనాలా.. రోజూ ఒకటి తింటే...
Clove Benefits

Updated on: Dec 23, 2025 | 7:30 AM

వెల్లుల్లి ఇది లేకుంటే వంటకాలకు టేస్టే ఉండదు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు.. మన శరీరానికి ఔషదంగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు మనను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. దీని ప్రధాన ప్రయోజనం అల్లిసిన్ అనే సమ్మేళనం వల్ల వస్తుంది. వెల్లుల్లిలో భాస్వరం, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె , ఫోలేట్ , నియాసిన్, థియామిన్ కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఖాళీ కడుపుతో తినడం సరైనదా.. కాదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే దీన్ని ఖాళీ కడపుతో తినొచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం

వెల్లులి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి: వెల్లుల్లి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే, ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యం: ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను నిర్వహించేందుకు సహాయపడుతుంది. ఇది రక్తపోటును సైతం నియంత్రించి గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి ఒక మంచి ఎంపిక.. ఇది జీవక్రియను సక్రియం చేస్తుంది, ఇది మన శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్లా త్వరగా బరువు తగ్గవచ్చు.

జీర్ణక్రియ: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.

చర్మం,జుట్టుకు ప్రయోజనాలు: వెల్లుల్లి చర్మంతో పాటు జుట్టుకు కూడా ప్రయోజకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని స్పష్టంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో, ఇది జుట్టును బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

వెల్లుల్లిని ఎలా తినాలి?

ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బ తొక్క తీసి తేలికగా నమలవచ్చు. లేకపోతే, నీటిలో నానబెట్టుకొని కూడా తినవచ్చు. ఒక వేళ పచ్చి వెల్లుల్లి తినడం మీకు కష్టంగా అనిపిస్తే, దాని మెత్తగా దంచి గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసి విషయం ఏమిటంటే మీకు ఏవైనా అలెర్జీ సమస్యలు ఉంటే, మీరు దానిని తినకుండా జాగ్రత్త వహించాలి. అలాగే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.