Lassi: చక్కెర లేకుండానే స్వీట్‌గా ఉండే లస్సీ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసి తాగితే.. స్వర్గమే!

How to make perfect Lassi at home: సమ్మర్ వచ్చేసింది, బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే శరీరాన్ని చల్లబరిలే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మన బాడీనికి చల్లగా ఉంచడంతో లస్సీ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్ట చక్కర లేకుండా స్వీట్‌గా ఉంటే లస్సీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి.

Lassi: చక్కెర లేకుండానే స్వీట్‌గా ఉండే లస్సీ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసి తాగితే.. స్వర్గమే!
Sugar Free Lassi Recipe

Updated on: Apr 13, 2026 | 7:30 AM

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు కేవలం నీరు మాత్రమే కాకుండా లస్సీ, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది. అయితే కొంతమంది షుగర్ వంటి వ్యాధులతో బాధపడేవారు. చక్కెర కలుపడం వల్ల లస్సీకి దూరంగా ఉంటారు. అలాంటి వారికి పంచదారకు బదులుగా బెల్లం లేదా పటిక బెల్లం కలిపి చేసే షుగర్ ఫ్రీ లస్సీ మంచి ఎంపిక అవుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవలో చూద్దాం.

షుగర్ ప్రీ లస్సీకి కావలసిన పదార్థాలు

  • పెరుగు- చిక్కటి పెరుగు
  • సోంపు- నానబెట్టిన సోంపు లేదా సోంపు పొడి
  • తీపి కోసం- పటిక బెల్లం లేదా బెల్లం
  • పుదీనా- కొన్ని తాజా ఆకులు
  • నీరు, ఐస్ ముక్కలు- అవసరమైన మేర

తయారీ విధానం:

  • షుగర్ ఫ్రీ లస్సీని తయారు చేసేందుకు ముందుగా సోంపును 2-3 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఆ సోంపును కొద్దిగా నీటితో కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్‌లో పెరుగు, వడకట్టిన సోంపు రసం, తగినంత పటిక బెల్లం లేదా బెల్లం, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా చల్లని నీరు వేయండి.
  • వీటన్నింటినీ కలిపి బాగా బ్లెండ్ చేయండి. లస్సీ పైన మీగడలాగా నురగ వచ్చే వరకు గ్రైండ్ చేస్తే మీ లస్సీ రెడీ అయినట్టే
  • తర్వాత లస్సీని సర్వింగ్ గ్లాసులో పోసి, కొన్ని ఐస్ ముక్కలు వేసి చల్లచల్లగా ఆస్వాధించండి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఈ షుగర్ ఫ్రీ లస్సీ వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. సోంపు, పుదీనా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఎండ తీవ్రత వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తాయి. ఇందులో చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us