AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో తాన్య లైఫ్ ఛేంజ్.. ఈ సవాల్‌కు మీరు సిద్ధమా..?

అర్ధరాత్రి వరకు ఫోన్.. ఉదయాన్నే ఆఫీసుకి హర్రీబర్రీగా పరుగులు.. ఇదీ నేటి తరం యువత రోజూవారీ దినచర్య ఇదీ. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల తాన్యది కూడా సేమ్ ఇదే పరిస్థితి. అయితే ఆమె తీసుకున్న కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో తన లైఫ్‌స్టైల్‌ మొత్తం మారిపోయింది. ఇంతకీ ఆమె తీసుకున్న ఆ 30 రోజుల సవాల్ ఏంటో తెలుసుకుందాం..

4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో తాన్య లైఫ్ ఛేంజ్.. ఈ సవాల్‌కు మీరు సిద్ధమా..?
Benefits Of Waking Up At 5 Am
Krishna S
|

Updated on: Jun 29, 2026 | 7:02 AM

Share

ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా నిద్రలేవడం. ఆఫీస్ ఒత్తిడి ఒకరైతే, అర్ధరాత్రి వరకు సోషల్ మీడియా, నెట్‌ఫ్లిక్స్ రీల్స్‌తో కాలక్షేపం చేసేవారు మరికొందరు. సరిగ్గా ఇలాంటి లైఫ్‌స్టైల్‌తో విసిగిపోయి, తన జీవితాన్ని తానే మార్చుకున్న ఒక ఢిల్లీ యువతి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణ ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల తాన్య.. ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగి. రోజుకు వందల కొద్దీ ఈమెయిల్స్, క్లయింట్ మీటింగ్‌లతో ఆమె జీవితం ఎప్పుడూ తీరిక లేకుండా సాగేది. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉండటం, ఆపై ఆఫీసుకు ఆలస్యంగా పరుగెత్తడం, అలసటను దూరం చేసుకోవడానికి రోజంతా టీ, కాఫీలు తాగడం ఆమెకు అలవాటుగా మారింది. దీనివల్ల ఆమె శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఈ విషవలయం నుంచి బయటపడటానికి తాన్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదే 30 రోజుల ఉదయం 5 గంటల సవాల్.

మొదటి 5 రోజులు.. నరకంలా

ఈ ఛాలెంజ్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. ‘‘మొదటి మూడు రోజులు నరకం కనిపించింది. తెల్లవారుజామున 5 గంటలకే అలారం మోగినప్పుడు దాన్ని ఆపేసి, ఇంకొంచెం సేపు పడుకోవాలనే తపన ప్రతిరోజూ ఉండేది. రాత్రిపూట నిద్ర సరిపోకపోవడం వల్ల మొదటి కొన్ని రోజులు మధ్యాహ్నం వేళ తల బరువుగా అనిపించడం, విపరీతమైన నిద్ర రావడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి’’ అని చెప్పుకొచ్చింది. అయితే తాన్య వెనకడుగు వేయలేదు. నాలుగో రోజు నుండి ఆమె శరీరం మారడం ప్రారంభించింది. రాత్రి 10:30 గంటలకే ఆమెకు నిద్ర రావడం మొదలైంది. జీవ గడియారం నెమ్మదిగా కొత్త సమయానికి అలవాటు అయ్యింది.

మీకంటూ కొంత సమయం..

రెండవ వారం వచ్చేసరికి తాన్యకు ఒక కొత్త సత్యం బోధపడింది. ఉదయం 5 నుండి 8 గంటల మధ్య.. ఆఫీస్ ఈమెయిల్స్ ఉండవు, సోషల్ మీడియాలో స్నేహితుల మెసేజ్‌ల గందరగోళం ఉండదు. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉన్న ఆ 3 గంటల సమయం కేవలం తన కోసమే దొరికిందని ఆమె గ్రహించింది. ‘‘నా జీవితంలో మొదటిసారిగా.. నాకంటూ కేటాయించుకునే సమయం అంటే ఏమిటో నాకు అర్థమైంది. లేకపోతే నిద్రలేవగానే ఆఫీసుకు పరుగెత్తాలనే ఆత్రుతతోనే రోజు గడిచిపోయేది’’ అని తాన్య ఆనందంగా చెప్పింది. ఆ ప్రశాంత సమయంలో ఆమె ఢిల్లీలోని స్వచ్ఛమైన గాలిలో నడవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, ఒంటరిగా ఒక కప్పు టీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదించడం అలవాటు చేసుకుంది.

పెరిగిన ఏకాగ్రత.. మాయమైన అలసట

30 రోజులు ముగిసేసరికి తాన్యలో వచ్చిన మార్పులు చూసి ఆమె సహోద్యోగులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమెకు నిద్రలేవడానికి అలారం కూడా అవసరం లేదు. అన్నింటికంటే పెద్ద మార్పు ఆమె పనితీరులో వచ్చింది. గతంలో ఆఫీసులో 4 గంటలు పట్టే పనిని, ఇప్పుడు కేవలం 2 గంటల్లోనే పూర్తి చేయగలుగుతోంది. మధ్యాహ్నం వేళ వచ్చే నీరసం పూర్తిగా మాయమైంది. మనసు ఎల్లప్పుడూ చురుగ్గా, సృజనాత్మకంగా మారింది.

సైన్స్ ఏం చెబుతోంది?

హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వారి పరిశోధనల ప్రకారం.. తమ నిద్రవేళలను, నిద్రలేచే సమయాలను సాధారణం కంటే కేవలం ఒక గంట ముందుగా మార్చుకునే వ్యక్తులలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 23శాతం తగ్గుతుంది. ఉదయపు సూర్యరశ్మి శరీరంలో మానసిక స్థితిని మెరుగుపరిచే హ్యాపీ హార్మోన్లను విడుదల చేయడమే దీనికి ప్రధాన కారణం. మీరు కూడా ప్రతిరోజూ అలసటగా, ఒత్తిడితో కూడిన జీవితంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే తాన్య సక్సెస్ ఫార్ములాను మీరూ ప్రయత్నించండి.

Follow Us