
ఇటీవల కాలంలో చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టదు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆందోళనలతో పాటు హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళల శరీరం పురుషులతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. నెలసరి, గర్భధారణ, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ స్థాయిల్లో వచ్చే మార్పులు నిద్రపై ప్రభావం చూపుతాయి. ఈస్ట్రోజన్ నిద్రకు సహాయపడే సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. కానీ, నెలసరి లేదా మెనోపాజ్ సమయంలో దీని స్థాయి తగ్గితే వేడి అలికిడి, చెమటలు పెరిగి నిద్ర భంగం కలుగుతుంది.
నిజానికి నిద్ర, హార్మోన్లు పరస్పరం అనుసంధానంగా ఉంటాయి. ఒకటి సరిగ్గా లేకపోతే మరొకటి ప్రభావితమవుతుంది. కాబట్టి కొన్ని అలవాట్లు మార్చుకోవడం అవసరం.
ఇన్ని పాటించినా నిద్ర సమస్య కొనసాగితే, వైద్యుల సలహాతో మెలటోనిన్ సప్లిమెంట్లు లేదా అవసరమైన చికిత్సలు తీసుకోవచ్చు.
మంచి నిద్ర వల్ల ఒత్తిడి, డిప్రెషన్, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి.