Bathroom Cleaning: బాత్రూం ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుందా.. మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..
బాత్రూం నుంచే రోజు మొదలవుతుంది. దాన్ని అందంగా, శుభ్రంగా ఉంచుకోవడంలోని ఆ ఇంట్లోని వారి అభిరుచి తెలుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు బాత్రూంలో ఈ చిన్న క్లీనింగ్ టిప్స్ పాటిస్తే ఏ సమయంలోనైనా దీని మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. లేదంటే ఇవి దాని అందాన్ని పాడుచేయడమే కాకుండా లేనిపోని ఇన్ఫెక్షన్లు కలుగజేస్తాయి. ప్రతి వారం బాత్రూంను కడగడంతో పాటు ఈ విషయాలపైనా ఓ కన్నేసి ఉంచండి..

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఇంట్లోని బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవడం అంతకన్నా ముఖ్యం. ఇంటికెవరైనా అతిథులు వస్తున్నారంటే ముందుగా మన చూపు ఇంటి బాత్రూంవైపే ఉంటుంది. ఎందుకంటే దీని శుభ్రతను బట్టే మన హైజీన్ అలవాట్లను కూడా ఈజీగా జడ్జ్ చేస్తుంటారు. వారంలో ఒక్కరోజు దీని శుభ్రతపై మనసు పెడితే ఇక ఇంటికి ఎవరొచ్చినా చింత లేకుండా ఉండొచ్చు. అంతేకాదు మీ రోజును కూడా మొదలు పెట్టేది ఇక్కడి నుంచే కాబట్టి ఆహ్లాదంగా ఉండొచ్చు. బాత్రూంను ఎప్పుడూ అద్దంలా నీట్ గా ఉంచే టిప్స్ ఏంటో తెలుసుకోండి.
మన బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే, దానిని ఉపయోగించడానికి అసౌకర్యంగా ఉండవచ్చు. మీ బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయపడే చిట్కాలను చూద్దాం. మన బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే, దానిని ఉపయోగించడానికి అసౌకర్యంగా ఉండవచ్చు. మీ బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయపడే చిట్కాలను చూద్దాం.
ముందుగా మీరు బాత్రూమ్ లో ఏ వస్తువునైతే ఉపయోగించరో వాటిని ముందు అక్కడి నుంచి తొలగించండి. దాని వైశాల్యం ఉండేదే తక్కువ. అక్కడ లేనిపోని వాటిని ఉపయోగిస్తే అది మరింత ఇరుకుగా మారి అందవిహీనంగా కనపడుతుంది.
మీరు రోజూ ఉపయోగించే వస్తువులను మాత్రమే బాత్రూంలో ఉంచండి. వాటిని కూడా ఓ పక్కగా నీటిగా సర్దుకోండి. లేదంటే అద్ధం వెనకభాగంలో స్థలాన్ని కేటాయించి దాని తలుపుకు అద్ధాన్ని ఫిక్స్ చేసుకోండి. ఇది బయటివారు మీ వాష్ రూం వాడినప్పుడు మీ వస్తువులకు ప్రైవసీ ఉండేలా చేస్తుంది.
మీరు బాత్రూంలో ఉపయోగించే ఉత్పత్తుల గడువు తేదీని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. వీటిని ఎక్కువ కాలం ఇలాగే వదిలేసి వాడితే అవి లేనిపోని అనర్థాలను కలిగిస్తాయి. బాత్రూంలో ఒక డస్ట్ బిన్ ఉంచగలిగితే అది మొత్తం శుభ్రతలో కీలక పాత్ర పోషిస్తుంది.
మీ బాత్రూమ్ నుండి పాత అరిగిపోయిన తువ్వాళ్లను తీసివేయండి. ఇవి మీ వాష్ ఏరియాను మరింత ఇబ్బందికరంగా మారుస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని ఉతికి వేయండి. పాడైన వాటిని డోర్ మ్యాట్స్ లేదా శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు.
మీ బాత్రూంలో పాత డ్రైయర్లు, ఫ్లాట్ ఐరన్లు మొదలైన ఉపయోగించని వాటిని వెంటనే తొలగించేయండి. విరిగిన విద్యుత్ ఉపకరణాలను వదిలించుకోండి. లేదంటే అవి ప్రమాదానికి కారణమవుతాయి.
మీరు కొత్త సబ్బు లేదా షాంపూ వాడటం ప్రారంభించినప్పుడు, బాత్రూంలో చెత్త పడకుండా ఉండటానికి ఖాళీ ప్యాకెట్‌ను సరైన స్థలంలో పారవేయండి.
అలంకరణ పేరుతో మీ బాత్రూమ్‌ను పెద్ద మొక్కలు అదనపు కర్టెన్లతో నింపకుండా వీలైనంత ఖాళీగా వదిలేయండి. ఇది మీ బాత్రూంను చూడగానే గజిబిజిగా లేకుండా చేస్తుంది.