మఖానా, పాలు కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మఖానా, పాలు కలిపి తాగడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది శక్తిని పెంచి, మంచి నిద్రను ప్రోత్సహించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పానీయంగా నిలుస్తుంది. మఖానాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మానికి మెరుగైన ఆరోగ్యం అందిస్తుంది. రోజూ మఖానా పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి.

మఖానా, పాలు రెండూ పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని కలిపి మరిగించి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మఖానా తామర గింజల నుంచి తీసుకోవడమే కాకుండా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. పాలలో ఉండే పోషకాలతో మఖానా కలిసినప్పుడు వీటి ప్రభావం మరింత పెరుగుతుంది.
మఖానాలు మెలటోనిన్ హార్మోన్‌ను పెంచుతాయని చెప్పబడుతుంది. మెలటోనిన్ అనేది నిద్రకు దోహదపడే హార్మోన్, ఇది మీకు మంచి నిద్రను కలిగిస్తుంది. పాలు, మఖానాలు కలిపి తాగినప్పుడు నిద్ర సమస్యలు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలో నిద్రకు అవసరమైన హార్మోన్లు పెరుగుతాయి. దాంతో గాఢంగా నిద్రపోగలరు.
మఖానా తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఫైబర్ వల్ల కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. మఖానాను పాలలో మరిగించి తాగితే మీకు చాలా కాలం వరకు ఆకలి పట్టదు. దీంతో చిరుతిండిలాంటి అహారాన్ని తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్ల అధిక బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది.
మఖానా ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి రోజంతా శక్తిని అందిస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి ప్రోటీన్ అవసరం. పాలు, మఖానా మిశ్రమం శక్తిని కాపాడటానికి, శారీరక శక్తిని పెంచటానికి దోహదం చేస్తుంది. దీనివల్ల శారీరక పని లేదా మానసిక పనులలో కూడా అధిక శక్తి ఉండటం సాధ్యం.
మఖానాలో అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరంలోని సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ యాంటీఆక్సిడెంట్లు పనిచేస్తాయి. పాలలో మఖానా కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తామర గింజలలో సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పొటాషియం అధికంగా ఉండటంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మఖానా సహాయపడుతుంది. ఇది రక్తపోటును సమతుల్యం చేసేందుకు తోడ్పడి గుండె సంబంధిత సమస్యలను తగ్గించగలదు.
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా నియంత్రించబడతాయి. మఖానాను పాలతో మరిగించి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల మధుమేహం బాధితులు కూడా మఖానాను తీసుకోవచ్చు.
మఖానాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చిన మార్పులను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఈ యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి.
మఖానా పాలను ఇలా తయారు చేయండి. తక్కువ వేడి మీద ఒక గ్లాసు పాలు వేడి చేయండి. అందులో 8-10 మఖానాలు వేసి 5-7 నిమిషాలు మరిగించండి. మీరు కొంచెం తేనె లేదా బెల్లం కలిపి తాగవచ్చు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.