Black Salt Water: నల్ల ఉప్పు నీళ్లు తాగితే.. ఈ వ్యాధులన్నీ మాయం చేసుకోవచ్చు..

|

Jun 11, 2024 | 10:54 PM

ఉప్పు ఆరోగ్యానికి ఎంత మంచిది. అయితే అంతే అనారోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది. ఉప్పులో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో నల్ల ఉప్పు కూడా ఒకటి. సాధారణ తెల్ల ఉప్పు కంటే.. నల్ల ఆరోగ్యానికి మరింత మంచిది. పలు భాషల్లో నల్ల ఉప్పును అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం క్లోరైడ్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. నల్ల ఉప్పును కేవలం వంటల్లోనే కాకుండా..

Black Salt Water: నల్ల ఉప్పు నీళ్లు తాగితే.. ఈ వ్యాధులన్నీ మాయం చేసుకోవచ్చు..
Black Salt water
Follow us on

ఉప్పు ఆరోగ్యానికి ఎంత మంచిది. అయితే అంతే అనారోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది. ఉప్పులో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో నల్ల ఉప్పు కూడా ఒకటి. సాధారణ తెల్ల ఉప్పు కంటే.. నల్ల ఆరోగ్యానికి మరింత మంచిది. పలు భాషల్లో నల్ల ఉప్పును అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం క్లోరైడ్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. నల్ల ఉప్పును కేవలం వంటల్లోనే కాకుండా పలు షర్బత్ డ్రింక్స్‌లో కూడా ఉపయోగిస్తారు. ఈ ఉప్పును ఉపయోగించడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. అయితే నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ట క్లీన్ అవుతుంది:

నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల పొట్ట అనేది క్లీన్ అవుతుంది. పొట్టలోని మలినాలు తొలగిపోయి ప్రేగులు శుభ్ర పడతాయి. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సుఖ విరేచనం కూడా అవుతుంది.

బాడీని కూల్ చేస్తుంది:

నల్ల ఉప్పు.. శరీరాన్ని చల్లబరుస్తుంది. బాడీపై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. పొట్టను ఎంతో చల్లగా ఉంచుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా అనిపించినప్పుడు, వేడి చేసినప్పుడు ఈ ఉప్పును తీసుకోవడం వల్ల చాలా ఉపశమనంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెటబాలిక్ రేటు పెరుగుతుంది:

నల్ల ఉప్పు నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ నీటిలో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల మెటబాలిక్ రేటు అనేది పెరుగుతుంది.

లివర్ హ్యాపీ:

నల్ల ఉప్పు నీటిని తాగడం వల్ల లివర్ అనేది డిటాక్స్ అవుతుంది. లివర్‌ని డిటాక్స్ చేయడంలో ఈ నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల లివర్‌లో పేరుకు పోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. ఎలాంటి లివర్ వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉంటుంది.

రక్తం శుద్ధి అవుతుంది:

నల్లు ఉప్పు నీళ్లు తాగడం వల్ల రక్తం అనేది శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే మలినాలను బయటకు పంపిస్తుంది. దీంతో ఎలాంటి బ్లడ్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

చర్మం ఆరోగ్యంగా:

నల్ల ఉప్పు నీటిని తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉప్పులోని గుణాలు శరీరానికి అందడంతో చర్మంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో చర్మం లోపలి నుంచి కాంతివంతంగా తయారవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..