Jamun Seeds: ఈ విషయాలు తెలుసుకున్నారంటే ఇకపై నేరేడు విత్తనాలను పడేయరు..

ఈ మధ్య కాలంలో విత్తనాల ప్రాముఖ్యత బాగా పెరిగింది. కేవలం పండ్లు తిని విత్తనాలను పడేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో పండ్ల లోపల ఉండే విత్తనాలను కూడా ఉపయోగిస్తున్నారు. పండ్లతో పాటు విత్తనాల్లో ఉండే పోషకాలును తీసుకుంటున్నారు. ఇలా నేరేడు పండ్ల విత్తనాలు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. నేరేడు పండ్లు తిని విత్తనాలు పడేస్తూ ఉంటారు. కానీ ఇకపై అలా చేయండి. వీటిల్లో కూడా శరీరానికి ఉపయోగ పడే పోషకాలు ఉన్నాయని..

Jamun Seeds: ఈ విషయాలు తెలుసుకున్నారంటే ఇకపై నేరేడు విత్తనాలను పడేయరు..
Jamun Seeds

Updated on: Oct 23, 2024 | 2:07 PM

ఈ మధ్య కాలంలో విత్తనాల ప్రాముఖ్యత బాగా పెరిగింది. కేవలం పండ్లు తిని విత్తనాలను పడేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో పండ్ల లోపల ఉండే విత్తనాలను కూడా ఉపయోగిస్తున్నారు. పండ్లతో పాటు విత్తనాల్లో ఉండే పోషకాలును తీసుకుంటున్నారు. ఇలా నేరేడు పండ్ల విత్తనాలు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. నేరేడు పండ్లు తిని విత్తనాలు పడేస్తూ ఉంటారు. కానీ ఇకపై అలా చేయండి. వీటిల్లో కూడా శరీరానికి ఉపయోగ పడే పోషకాలు ఉన్నాయని.. ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నేరుడు గింజల వలన ఉండే లాభాలు తెలిస్తే.. ఈసారి మీరు గింజలను పడేయకుండా దాస్తారు. మరి ఈ నేరుడు గింజలతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? ఏ సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీ కంట్రోల్:

నేరేడు పండ్ల గింజలను తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు హైబీపీ సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు నేరేడు గింజలను ఎండ బెట్టి పొడిలా తీసుకుంటే.. రక్త పోటు అనేది కంట్రోల్ అవుతుంది. ఇందులో ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బీపీని నార్మల్ చేస్తుంది.

వెయిట్ లాస్:

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు నేరేడు పండ్లను తిన్నా.. గింజలను తీసుకున్నా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇవి బరువు తగ్గడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తం శుభ్రం:

నేరేడు గింజలు తీసుకోవడం వల్ల శరరీంలో ఉండే రక్తం కూడా శుభ్రం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది రక్త హీనతను తగ్గించడమే కాకుండా.. రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలను బయటకు పంపి.. బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చేస్తుంది.

విష పదార్థాలు బయటకు:

శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలను తొలగించి.. బాడీని డీటాక్స్ చేయడంలో ఈ నేరేడు పండ్ల గింజలు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. చెమట రూపంలో మలినాలను బయటకు పంపుతుంది.

షుగర్ కంట్రోల్:

నేరేడు గింజలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. వీటిల్లో జాంబోలైన్, జంబోసైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇలా ఈ గింజలతో చాలా లాభాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..