Smoking: పొగరాయుళ్లు జాగ్రత్త.. స్మోకింగ్‌తో ఈ సమస్య కూడా తప్పదు..

స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బనడం, గుండెపోటుకు దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సిగరెట్ తాగడం వల్ల కేవలం శ్వాస సంబంధిత సమస్యలు రావడం మాత్రమే కాకుండా.. ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వెన్నుపూస ఆరోగ్యంపై కూడా స్మోకింగ్...

Smoking: పొగరాయుళ్లు జాగ్రత్త.. స్మోకింగ్‌తో ఈ సమస్య కూడా తప్పదు..
Smoking
Follow us

|

Updated on: Oct 15, 2024 | 12:01 PM

స్టైల్‌గా మొదలు పెడతారు చివరికి దానికి బానిసగా మారుతుంటారు. పొగరాయుళ్లు స్మోకింగ్‌కు అలవాటు పడేది ఇలాగే. అయితే స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంత ప్రమోదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మోకింగ్ చేసినప్పుడల్లా మనిషి తన ఆయుష్షును తగ్గించుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే పొగరాయుళ్లు మాత్రం ఈ అలవాటును మానుకోరు.

స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బనడం, గుండెపోటుకు దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సిగరెట్ తాగడం వల్ల కేవలం శ్వాస సంబంధిత సమస్యలు రావడం మాత్రమే కాకుండా.. ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వెన్నుపూస ఆరోగ్యంపై కూడా స్మోకింగ్ కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

పొగతాగడం వల్ల స్పైనల్ స్టెనోసిస్‌తో పాటు డిజెనరేటివ్ డిస్క్ వంటి వ్యాధులు వస్తాయని పరిశోధనలో తేలింది. అప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతోన్న వారు స్మోకింగ్ చేస్తే మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇది స్పాండిలోసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ధూమపానం ఎముకల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మోకింగ్‌ వల్ల శరీరంలో నికోటిన్ పెరుగుతుంది. ఇది వెన్నుపాములోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీంతో పోషకాలు, ఆక్సిజన్‌ శరీరంలో అన్ని ప్రాంతాలకు చేరుకోదు. ఇది శరీరంలో వాపు, నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇక నికోటిన్‌ కారణంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి దారి తీస్తుంది. ఈ కారణంగా శరీరానికి అవసరమైన పోషకాహారం లభించదు. శరీరంలో నికోటిన్‌ కొత్త రక్త నాళాలను ఏర్పరుచుకునే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. సిగరెట్‌లలో నికోటిన్‌తో పాటు కాడ్మియం, లెడ్, నికెల్, క్రోమియం మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన మరియు విషపూరితమైన అంశాలు ఉంటాయి, ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి.

స్మోకింగ్ వల్ల వెన్ను నొప్పి పెరిగే అవకాశాలు 30 శాతం పెరుగుతుందని అన్నల్స్ ఆఫ్ ది రుమాటిక్ డిసీజెస్‌లో ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఇందుకోసం 13,000 మంది పరిగణలోకి తీసుకున్నారు. ధూమపానం వల్ల వారి మెడ, భుజాలు, మోచేతులు, చేతులు, తుంటి, మోకాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..