ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ !!
ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో ముఖ్య మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ ప్రయోజనాల్లో కోత పెట్టింది. గ్రాసరీ కొనుగోళ్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్ సర్‌ఛార్జి రద్దు, లేట్ పేమెంట్ ఛార్జీల విషయంలో మార్పులు చేసింది. నవంబర్ 15 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇస్తోంది.
ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో ముఖ్య మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ ప్రయోజనాల్లో కోత పెట్టింది. గ్రాసరీ కొనుగోళ్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్ సర్‌ఛార్జి రద్దు, లేట్ పేమెంట్ ఛార్జీల విషయంలో మార్పులు చేసింది. నవంబర్ 15 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇస్తోంది. యుటిలిటీ ఇంకా ఇన్సూరెన్స్ చెల్లింపులపై కొత్తగా ఐసీఐసీఐ బ్యాంక్ పరిమితిని తీసుకొచ్చింది. ప్రీమియం కార్డు హోల్డర్లకు రూ.80వేల వరకు, సాధారణ కార్డు హోల్డర్లకు రూ.40 వేలు వరకు మాత్రమే ఇకపై రివార్డులు అందనున్నాయి. పెట్రోల్ పంపుల్లో ఫ్యూయల్ కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆపై కొనుగోళ్లకు సర్‌ఛార్జి చెల్లించాల్సిందే. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక ఎమరాల్డ్ మాస్టర్ కార్డ్ మెటల్ క్రెడిట్ కార్డుపై మాత్రమే ఈ పరిమితి రూ.లక్ష వరకు ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమల హారిస్ గెలుపుకోసం.. ఏఆర్ రెహ్మాన్ పాటలు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్ ఫైర్.. ఏం జరిగిందంటే ??