బాలికల కోసం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు.. వీటి గురించి తెలుసా?
14 October 2024
TV9 Telugu
TV9 Telugu
వంటింటికే పరిమితమవుతున్న ఆడపిల్లలను సమాజ స్రవంతిలోకి తీసుకురావాలని, వారి అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని పథకాలు అమలు చేస్తుంది
TV9 Telugu
10 ఏళ్లలోపు బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించవచ్చు. ఏడాదికి రూ.250 నుంచి రూ.1,50,000 వరకు 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి శాతం 8.2 వడ్డీ అందిస్తారు
TV9 Telugu
కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుంది. దీనిని తొలగించి సమానత్వ భావాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం 2015లో బేటీ బచావో, బేటీ పఢావో అభియాన్‌ను ప్రారంభించింది
TV9 Telugu
ఈ పథకం కింద 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికలకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ సహాయం అందిస్తుంది
TV9 Telugu
అంగన్‌వాడీలు, పాఠశాలల ద్వారా కిశోర బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. జనౌషధి కేంద్రాల్లో శానిటరీ ప్యాడ్‌లను అందిస్తున్నారు
TV9 Telugu
ఇంజినీరింగ్ కాలేజీల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు ఉదాన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద 11, 12 తరగతుల బాలికలకు వివిధ ప్రోత్సాహకాలు అందించబడతాయి
TV9 Telugu
ఆడపిల్లలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతికి వెళ్లే పెళ్లికాని బాలికల చదువును ప్రోత్సహిస్తారు
TV9 Telugu
ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వర్కింగ్ విమెన్ హాస్టల్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. వారి పిల్లల సంరక్షణకు కూడా ఈ హాస్టల్స్‌లో ఏర్పాట్లు ఉంటాయి. నెలవారీ ఆదాయం రూ.50,000 కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది