వీటితో పొట్ట ఆరోగ్యం పరేషాన్‌..

Narender Vaitla

14 October 2024

పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కడుపుబ్బరం, గ్యాస్‌, అతిసారం వంటి సమస్యలకు డెయిరీ ప్రొడక్ట్స్‌ కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లాక్టోస్‌ అలర్జీలు ఉన్న వారికి పాలలోని షుగర్‌(లాక్టోస్)ను జీర్ణమవదు.

స్పైసీ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటే కూడా జీర్ణాశయ ఆరోగ్యం దెబ్బతింటుంది. కారం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే.. పొట్ట, పేగు లైనింగ్‌పై ప్రభావం పడుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకున్నా కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా ఫైబర్‌ ఫుడ్‌ తింటే.. పేగుల్లో గ్యాస్, పొత్తికడుపు ఉబ్బరం ఎక్కువవుతుంది.

కొందరిలో పచ్చి కూరగాయలు కూడా జీర్ణ సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే కడుపు సంబంధిత సమస్యలున్న వారు వీటిని మితంగా తీసుకోవాలి.

జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు. ఆ సమస్య బారిన పడకుండా ఉండాలన్నా టీ, కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని కెఫీన్‌ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.

 ఆల్కహాల్‌ తీసుకునే వారిలో కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.