Health: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్‌ తాగుతున్నారా.. ఏమవుతుందో తెలుసా.?

హాట్‌ హాట్‌గా చికెన్‌ బిర్యానీ తింటూ.. కూల్‌కూల్‌గా కూల్‌ డ్రింక్‌ తాగితే.. అబ్బా ఆ మజానే వేరు అని చాలా మంది భావిస్తుంటారు. బిర్యానీ లాగిస్తూ, కూల్‌ డ్రింక్‌ సిప్‌ చేస్తూ చిల్‌ అవుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిసిందే...

Health: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్‌ తాగుతున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
Health News
Follow us

|

Updated on: Oct 15, 2024 | 9:55 AM

హాట్‌ హాట్‌గా చికెన్‌ బిర్యానీ తింటూ.. కూల్‌కూల్‌గా కూల్‌ డ్రింక్‌ తాగితే.. అబ్బా ఆ మజానే వేరు అని చాలా మంది భావిస్తుంటారు. బిర్యానీ లాగిస్తూ, కూల్‌ డ్రింక్‌ సిప్‌ చేస్తూ చిల్‌ అవుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిసిందే. అందులోనూ బిర్యానీ తింటూ, కూల్ డ్రింక్‌ తాగడం మరింత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కూల్‌డ్రింక్‌ తాగుతూ.. బిర్యానీ తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* బిర్యానీ తింటూ కూల్‌ డ్రింక్‌ తాగితే కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బిర్యానీ లాంటి మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకుంటే కడుపులో గ్యాస్ట్రిక్‌ యాసిడ్ విడుదలవుతుంది. దానికి తోడు కూల్‌ డ్రింక్‌ తీసుకుంటే అందులోని యాసిడ్స్‌ జీర్ణ వ్యవస్థలో ఆమ్లాన్ని మరింత పెంచుతుంది. దీంతో ఇది గ్యాస్‌, గుండెలో మంట సమస్యకు దారి తీస్తుందని అంటున్నారు. మొదట్లో బాగానే అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.

* జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం ఇది దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కూల్‌ డ్రింక్‌లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది.

* మధుమేహంతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదానికి కారణమవుతుంది. బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు.. కూల్‌ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర స్థాయిలు రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

* కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బిర్యానీలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. కూల్ డ్రింకులతో పాటు తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్ లు ఎక్కువ అవుతాయి, ఇది కాలేయంతో పాటు కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది.

* కూల్‌ డ్రింక్స్‌లో అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. అలాగే బిర్యానీలోని కొవ్వు ఒబేసిటీ, అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. దీర్ఘకాలంలో ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..