
ఆదివారం వచ్చిందంటే.. చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలను ఇష్టంగా కొని తెచ్చుకుంటారు.. చికెన్, మటన్ ను పలు రకాలుగా.. వండుకుని తింటారు.. కూరగా, ఫ్రైగా ఇష్టంగా చేసుకుని తింటారు. చికెన్ లో అయితే ఎన్నో రకాల వంటకాలను చేసుకుని తింటారు.. సాధారణంగా నాన్ వెజ్ ప్రియుల్లో ఎక్కువగా చికెన్ ను తింటారు.. అందుబాటు ధరలో ఉండటంతో ఎక్కువ మంది చికెన్ ను కొని తెచ్చుంటారు.. వాస్తవానికి బ్రాయిలర్ కోళ్ల కంటే.. నాటు కోడి బాగుంటుంది.. అయితే.. బ్రాయిలర్ కోళ్లల్లో రెండు రకాలు ఉంటాయి.. ఒకటి పెద్ద బ్రాయిలర్.. రెండు చిన్న బ్రాయిలర్..
పెద్ద బ్రాయిలర్.. చిన్న బ్రాయిలర్ .. విషయానికొస్తే.. ఏది మంచిది.. ఏది తొందరగా ఉడుకుతుంది.. ఏది ఆరోగ్యకరమైనది.. అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి..
సాధారణంగా పెద్ద బ్రాయిలర్ తో పోలిస్తే.. చిన్న బ్రాయిలర్ కోళ్లు.. సుమారు కేజీన్నర నుంచి 2 కేజీల వరకు ఉంటాయి.. వీటి మాంసం మెత్తగా రుచిగా ఉంటుంది.. తక్కువ కొవ్వుతో ఉండటం వల్ల పెద్ద వాటి కంటే ఆరోగ్యకరమైనవి. పెద్ద బాయిలర్లలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా పెద్ద బ్రాయిలర్ తో పోలిస్తే.. చిన్న బ్రాయిలర్ చికెన్ వండటం కూడా ఈజీనే.. తొందరగా సులువుగా ఉడుకుతుంది.. పీస్ లు జ్యూసీగా అవుతాయి..కొవ్వు తక్కువగా ఉంటుంది.
ఇక పెద్ద బ్రాయిలర్ 2 కేజీల నుంచి 5 కేజీల వరకు ఉంటుంది.. దీని మాంసం గట్టిగా ఉంటుంది.. ఇంకా కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని డైటీషియన్లు పేర్కొంటున్నారు.
పెద్ద కోళ్లతో పోలిస్తే.. చిన్న కోళ్లలో హార్మోన్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు డైటీషియన్లు..
వాస్తవానికి పోషకాల పరంగా.. పెద్ద బ్రాయిలర్, చిన్న బ్రాయిలర్ రెండూ మంచివే.. అయితే పోషకాహారం.. ఆరోగ్యం పరంగా బ్రాయిలర్ కోళ్ల కంటే నాటు కోడి (Country Chicken) ఉత్తమ ఎంపిక అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
అయితే.. బ్రాయిలర్ కోడి మాంసం అధిక ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది.. ఇది మంచి చౌకైన ప్రోటీన్ వనరు. అయితే.. ఇవి వేగంగా పెరగడానికి వాడే హార్మోన్లు యాంటీబయాటిక్స్ వల్ల పరిమితంగా తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ల ఎముకలను తినకూడదని.. చర్మం, కొవ్వును తొలగించి తినడం ఆరోగ్యకరమని పేర్కొంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..