
తేనె, నిమ్మరసం రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటే, నిమ్మకాయలో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి, అంటు వ్యాధులను నయం చేయడానికి ఉపకరిస్తాయి. ఆయుర్వేదం పరంగా నిమ్మకాయ, తేనుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని ఇంటి వైద్యంగానూ తరతరాల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా తేనె, నిమ్మరసం చర్మానికి వివిధ రకాలుగా మేలు చేస్తాయి. ఈ రెండూ స్కిన్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మం మెరుపును పెంచి, ముఖంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. నిమ్మకాయ, తేనె రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఓసారి తెలుసుకుందాం..
ఎండ నుంచి రక్షిస్తుంది: నిమ్మ, తేనె రెండూ ముఖంపై సూర్యరశ్మి వల్ల కలిగే మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎండ వలన చర్మం ఎరుపును తగ్గిస్తుంది. నిమ్మకాయ రసం, తేనె మిశ్రమం సూర్యరశ్మి వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి కంటెంట్ వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించగా.. తేనె చర్మాన్ని చల్లబరుస్తుంది.
డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది: చాలా మంది డార్క్ సర్కిల్ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఎక్కువగా ఉంటే అందంపై ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ సమస్యను తగ్గించడానికి కళ్ల కింద నిమ్మకాయ, తేనె మిశ్రమాన్ని అప్లై చేయొచ్చు. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించి, ముఖాన్ని తేమగా ఉంచుతుంది.
నిమ్మ, తేనె పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది: తేనె, నిమ్మరసం రెండూ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి ముఖంపై నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును పెంచుతుంది.
పొడి చర్మం: పొడి చర్మం సమస్యతో ఇబ్బందిపడే వారికి నిమ్మకాయ రసం, తేనే మిశ్రమం మేలు చేస్తుంది. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. తేనె కూడా చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు కూడా తొలగిపోతాయి.
మొటిమలను తగ్గిస్తుంది: మొటిమల నివారణకు తేనె, నిమ్మకాయ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. ఈ రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని జీవనశైలి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..