AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిజ్.. మీ ఇంటికి ఏది బెస్ట్? కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి!

కొత్త ఫ్రిజ్ కొనాలనుకునే వారు ఎదుర్కొనే అతిపెద్ద సందేహం..సింగిల్ డోర్ తీసుకోవాలా లేక డబుల్ డోర్ తీసుకోవాలా? ఈ రెండింటికీ వాటి స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. మీ అవసరాలకు ఏది సరిపోతుందో ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోండి. ఒక చిన్న కుటుంబానికి సింగిల్ డోర్ (Single Door) లేదా డబుల్ డోర్ (Double Door) రిఫ్రిజిరేటర్లలో ఏది ఉత్తమమైనదో తప్పక తెలిసి ఉండాలి.

సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిజ్.. మీ ఇంటికి ఏది బెస్ట్? కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి!
Refrigerator Buying GuideImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2026 | 12:01 PM

Share

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. అలాగే, ప్రతి ఇంట్లనూ టీవీ, ఫ్రిజ్‌, వాషీంగ్‌ మెషీన్‌ వంటివి కూడా నిత్యవసరాలుగా మారిపోయాయి. కానీ, ఫ్రిజ్ కొనేటప్పుడు మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే సింగిల్‌ డోర్‌, డబుల్‌ డోర్‌ ఫ్రిజల్‌లను ఎంచుకునే వారు ఎలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలో ఇక్కడ చూద్దాం…

1. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ (Single Door): బ్యాచిలర్స్ లేదా ఇద్దరు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు ఇది ఉత్తమం. దీని సామర్థ్యం సాధారణంగా 150 నుండి 250 లీటర్ల మధ్య ఉంటుంది. అలాగే, దీని ధర చాలా తక్కువ. ఇది చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది (డైరెక్ట్ కూల్ టెక్నాలజీ). తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, ఇందులో ఐస్ క్రమం తప్పకుండా పేరుకుపోతుంది, దానిని మాన్యువల్‌గా డీఫ్రోస్ట్ చేయాలి. స్టోరేజ్ సామర్థ్యం తక్కువ.

2. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (Double Door) : 3 నుండి 4 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబాలకు ఇది సరిపోతుంది. వీటి సామర్థ్యం 250 లీటర్ల పైన ఉంటుంది. ఇందులో ఫ్రీజర్ (Freezer) విడిగా ఉంటుంది. దీనివల్ల ఫ్రిజ్ తలుపు తీసిన ప్రతిసారీ కూలింగ్ తగ్గదు. ఫ్రోస్ట్-ఫ్రీ టెక్నాలజీ వల్ల ఐస్ పేరుకుపోయే సమస్య ఉండదు. షెల్ఫ్‌లు వెడల్పుగా ఉండి పెద్ద పాత్రలను సులభంగా ఉంచుకోవచ్చు. సింగిల్ డోర్ కంటే ధర ఎక్కువ. కరెంటు బిల్లు కూడా సుమారు 20-30శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3. ఏది ఎంచుకోవాలి?: తక్కువ ధరలో మంచి కూలింగ్ ఇచ్చే సింగిల్ డోర్ ఫ్రిజ్‌ను ఎంచుకోండి. స్టోరేజ్, సౌలభ్యం ముఖ్యం అయితే, మీరు వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు ఎక్కువగా నిల్వ చేసేవారైతే డబుల్ డోర్ ఫ్రిజ్ తీసుకోవడం ఉత్తమం. చిన్న కుటుంబం అయి ఉండి, పొదుపుగా ఉండాలనుకుంటే సింగిల్ డోర్ సరిపోతుంది. కానీ భవిష్యత్తు అవసరాలను, అదనపు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుంటే డబుల్ డోర్ కొనుగోలు చేయడం మంచి పెట్టుబడి అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us