
వేసవి మొదలైంది. దోమల బెడద క్రమంగా పెరుగుతుంది. దోమలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ ప్రశాంతమైన రాత్రి నిద్రను నాశనం చేసే ఈ దోమలను వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే దోమల నివారణ మందులు వాడక పోవడమే మంచిది. వీటి వల్ల దోమల బెడద తగ్గినా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. వాటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు హానికరం. మీరు ఇంట్లో తయారు చేసుకోగల కొన్ని దోమల నివారణలు ఇక్కడ సూచిస్తున్నారు నిపుణులు. దోమల సమస్యను సహజమైన పద్ధతుల్లో నివారించడానికి ఈ సురక్షితమైన నివారణలు మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి.
ఒక దీపం తీసుకుని అందులో ఎండిన వేప ఆకులు, తేజ ఆకులు, కొంచెం కర్పూరం వేయాలి. కర్పూరం తేలికగా మండుతుంది కాబట్టి దానిని వెలిగించాలి. పొగ కనిపించడం ప్రారంభించిన వెంటనే దీపాన్ని దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంచాలి. దీని నుంచి వెలువడే సహజ సువాసనను దోమలు ఇష్టపడవు. కాబట్టి అవి వెంటనే ఇంటి నుండి దూరంగా పారిపోతాయ్.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.