Lifestyle: రాత్రి భోజనం చేయడం మానేస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..

|

Apr 02, 2024 | 9:39 PM

సాధారణంగా నిపుణులు ఉదయం, మధ్యాహ్నం కంటే రాత్రుళ్లు తక్కువగా ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణంగా రాత్రి పెద్దగా శారీరక శ్రమ ఉండదు. అందులోనూ ఈ బిజీలో లైఫ్‌లో రాత్రి పది తర్వాతే భోజనం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తినగానే నిద్రపోయే వారి ఎక్కువుతున్నారు. ఈ కారణంగానే ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలు కూడా...

Lifestyle: రాత్రి భోజనం చేయడం మానేస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..
Sleep
Follow us on

బరువు తగ్గాలనుకునే వారు చేసే మొదటి పని రాత్రిపూట భోజనం మానేయడం. రాత్రిపూట ఎక్కువగా తినడం వల్లే బరువు పెరుగుతారని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే డైటింగ్ పేరుతో రాత్రిపూట భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రిపూట భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా నిపుణులు ఉదయం, మధ్యాహ్నం కంటే రాత్రుళ్లు తక్కువగా ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణంగా రాత్రి పెద్దగా శారీరక శ్రమ ఉండదు. అందులోనూ ఈ బిజీలో లైఫ్‌లో రాత్రి పది తర్వాతే భోజనం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తినగానే నిద్రపోయే వారి ఎక్కువుతున్నారు. ఈ కారణంగానే ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అలా అని రాత్రిపూట మొత్తం తినకుండ ఉండడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట పూర్తిగా ఆహారం మానేయడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతే ఇన్సులిన్‌ స్థాయిలు క్షణిస్తానయి చెబుతున్నారు. దీనివల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే గ్యాస్‌ లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే అల్సర్‌, అసిడిటీ వంటి సమస్యలకు కూడా దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రుళ్లు తక్కువ ఆహారం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ పూర్తిగా మానేయడం మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండెలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..