నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా ఎందుకు తినరో తెలుసా?

ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతుంది. హిందూ దేవులను పూజించే వారికి ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఈ నెలలో చాలా వరకు హిందువు నాన్‌వెజ్‌ దూరంగా ఉంటారు. అయితే ఈ సీజన్‌ నాన్‌ వెజ్ మాత్రమే కాకుండా కొన్ని ఆకు కూరలను కూడా తినకూడదనే విషయం మీకు తెలుసా? అవను శ్రావణ మాసంలో కొందరు నాన్‌వెజ్‌తో పాటు కొన్ని ఆకు కూరలకు కూడా దూరంగా ఉంటారట. అవేంటో తెలుసుకుందాం.

నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా ఎందుకు తినరో తెలుసా?
Why You Shouldnt Eat Leafy Greens In Shravana Masam

Updated on: Aug 20, 2026 | 2:00 PM

శ్రావణమాసాన్ని పవిత్రమైన నెలగా భావించి చాలా మంది హిందువు ఈ నెల రోజుల పాటు మంసాహారిని దూరంగా ఉంటారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఎక్కవగా పండగలు, వ్రతాలు ఉండడం కారణంగా ప్రతి రోజు ఏదో ఒక పూజలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో నాన్‌వెజ్ తినకూడదని కొందరు అంటే.. వర్షాకాలంలో జీర్ణక్రీయ నెమ్మదిస్తుంది కాబట్టి నాన్‌వెజ్ తింటే అరగడానికి సమయం పడుతుంది.. అందుకే ఈ నెలలో నాన్‌వెజ్ తినొద్దని అంటారు.

అయితే ఈ నెలలో కేవలం నాన్‌వెజ్ మాత్రమే కాకుండా జనాలు కొన్ని ఆకు కూరలకు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే వర్షాకాలంలో పచ్చని ఆకు కూరలపై తేమ కారణంగా బ్యాక్టీరియా, క్రిములు వృద్ధి చెందుతాయి. వాటని మనం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇన్‌పెక్షన్‌ల బారీన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శ్రావణం మాసంతో పాటు పూర్తి వానాకాలం సీజన్‌లో గోంగూర, పాలకూర మెంతెం కూర, ఆవాల ఆకులు ఇతర కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండాలని అంటున్నారు.

ఈ ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వర్షాకాలంలో మాత్రం ఇవి మన ఆరోగ్యానికి శత్రువులుగా మారతాయంటున్నారు. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వర్షాకాలం అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, బ్యాక్టీరియా ఈ ఆకుకూరలను సులభంగా కలుషితం చేసి, మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us