Fruits on Empty Stomach: ఉదయం వేళల్లో ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఏమవుతుంది..?

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని ఎప్పుడు తినాలనే దానిపై కొందరిలో అనుమానాలు ఉంటాయి. నిజానికి వాటిని వేర్వేరు సమయాల్లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. వాటిలో ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదా? కాదా? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది..

Fruits on Empty Stomach: ఉదయం వేళల్లో ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఏమవుతుంది..?
Fruits

Updated on: Apr 19, 2026 | 12:12 PM

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివన్న సంగతి అందరికీ తెలుసు. కానీ వాటిని ఎప్పుడు తినాలనే దానిపై కొందరిలో అనుమానాలు ఉంటాయి. నిజానికి వాటిని వేర్వేరు సమయాల్లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. వాటిలో ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదా? కాదా? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది.

ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం పూట ఖాళీ కడుపుతో పండ్లు తినడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు ఎలాంటి పండ్లు తింటున్నారు అనేది ముఖ్యం. ఖాళీ కడుపుతో యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినకపోవడమే మేలు.

ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉదయాన్నే పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ ఉత్తేజపరుస్తుంది. పండ్లు తేలికగా, సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పండ్లలో ఉండే పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి, అనవసరంగా పదేపదే తినే అలవాటు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది అందరికీ సరిపోతుందా?

ఖాళీ కడుపుతో పండ్లు తినడం అందరికీ సరిపడదు. అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ముఖ్యంగా నారింజ, అరటిపండ్లు ఇలాంటి వారికి కడుపు నొప్పి, చికాకు కలిగిస్తాయి. అలాంటి వారు బొప్పాయి కూడా మితంగా తీసుకోవాలి.

సరైన పద్ధతి ఏది?

పండ్లను ఎల్లప్పుడూ తాజాగా తినాలి. పండ్ల రసం తాగడం కంటే వాటిని నేరుగా తినడం ఎక్కువ ప్రయోజనకరం. అయితే అన్ని రకాల పండ్లను కలిపి ఒకేసారి అధిక పరిమాణంలో తినడం మానుకోవాలి. అలాగే, పండ్లు తిన్న వెంటనే ఆహారం తినడం కూడా మంచిది కాదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us