ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. దగ్గర తగినంత డబ్బు ఉంటే మాల్‌లో ఖర్చు చేయడానికి అభ్యంతరం ఉండదు. కానీ తక్కువ డబ్బుతో పొదుపుగా షాపింగ్ చేయడం నిజమైన ప్రతిభ. చాలా మంది షాపింగ్ సమయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల వారి జేబు ఖాళీ అవుతుంటుంది. నెల బడ్జెట్ పూర్తిగా ఖాళీ అయిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన షాపింగ్ చిట్కాలను తెలుసుకోవడం వల్ల డబ్బును ఆదా చేసుకోవచ్చు. మీరు వాటిని పాటిస్తే తక్కువ డబ్బుతో షాపింగ్ చేసుకోవచ్చు.
హడావుడిగా షాపింగ్ చేయకండి. తీరికగా ఓపికగా షాపింగ్ చేస్తే ఏది కొనాలి, ఏది కొనకూడదు అని ఆలోచించగలుగుతారు. ఇలా చేయడం వల్ల అవసరమైన వస్తువులనే కొనుగోలు చేస్తారు. షాపింగ్‌కు వెళ్లే ముందు లిస్ట్ తయారు చేయకుండా షాపింగ్ చేయకండి. ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు మీ వద్ద వస్తువుల జాబితా ఉందా లేదా అని తనిఖీ చేయండి. ఇది చాలా ముఖ్యం. ముందస్తు జాబితాను సిద్ధం చేసుకోవడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే మీరు మార్కెట్‌లో జాబితా వెలుపల పనికిరాని వస్తువులను కొనుగోలు చేయకుండా డబ్బును ఆదా చేసుకుంటారు.
మీరు కొన్ని వస్తువులను మార్కెట్లో చూడగానే వెంటనే కొనాలని భావిస్తుంటారు. ఈ అలవాటు మీ నెలవారీ బడ్జెట్‌ను పాడు చేస్తుంది. మాల్స్‌లోని దుకాణదారులు అలాంటి వస్తువులను తమ ముందు అలంకరిస్తుంటారు. తద్వారా కస్టమర్లు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా కాకుండా మీరు ఇప్పటికే నిర్ణయించిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది.
మీరు బట్టలు గానీ, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నా షాపింగ్‌కు వెళ్లే ముందు ఫ్రిజ్, స్టోర్, డ్రాయర్, అల్మారా తనిఖీ చేయండి. లేకపోతే ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులను మీరు మళ్లీ కొనుగోలు చేస్తే డబ్బు వృధా అవుతుంది. దీని వల్ల అసలైన వస్తువులను కొనుగోలు చేయకుండా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి